
సాక్షి,చెన్నై: జయ టీవీ కార్యాలయం, శశికళ కుటుంబసభ్యులు, సన్నిహితుల కార్యాలయాలు, నివాసాలపై శుక్రవారం రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. గురువారం ఉదయం తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలోని 187 ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా తిరువూర్, తంజావూర్ జిల్లాలోని 47 ప్రాంతాల్లో సోదాలు పూర్తిచేసినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో పత్రాలను స్వాధీనం చేసుకున్నామని సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారి వెల్లడించారు.మరికొన్ని చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, సోదాలు ఎప్పటివరకూ కొనసాగుతాయన్నది ఇప్పుడే చెప్పలేమని ఆయన తెలిపారు.
సోదాలు జరిగిన చోట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నామని,మరికొన్ని చోట్ల అవసరమైన సమాచారం, పత్రాల కోసం గాలిస్తున్నామని చెప్పారు.ఆయా పత్రాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు బాధ్యులను ప్రశ్నిస్తామని, వీటిపై స్పష్టత వచా్చక మరింత ముందుకువెళతామని తెలిపారు.
ఇక చెన్నైలోనే దాదాపు 100 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వీటిలో జయ టీవీ కార్యాలయంతో పాటు జాజ్ సినిమాస్, శశికళ మేనల్లుడు, జయ టీవీ ఎండీ వివేక్ జయరామన్, అతని సోదరి కృష్ణప్రియ నివాసాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment