![Cash Seized House Of Minister Malla Reddy And His Relatives In IT Raids - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/24/Malla-Reddy.jpg.webp?itok=xHkGlP9N)
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేశారు. సోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ మల్లారెడ్డి సహా, కుమారులు, అల్లుడికి అధికారులు నోటీసులు ఇచ్చారు.
కాగా, తాను లేని సమయంలో తన కుమారుడితో తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించి సంతకం చేయించుకున్నారని బోయినపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌లో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సంతకం చేపించుకుంటున్నారని, ఇండ్లల్లో చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.
‘‘వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు.. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రాస్తున్నారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. గందరగోళంగా రైడ్స్ చేసారు. మా దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదు. మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అబద్ధాలు రాశారని’’ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు.
చదవండి: మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు.. అర్ధరాత్రి హైడ్రామా
Comments
Please login to add a commentAdd a comment