
సాక్షి, న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. ఈ నెలలో లాంచ్ చేసిన యాపిల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ నెల 20 నుంచి ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న యాపిల్ ఐఫోన్ 11 వేరియంట్ అవుట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచింది. అమెజాన్ ఇండియా, ప్లిప్‌కార్ట్‌లో ఇది ప్రీ ఆర్డర్‌కు లభించడంలేదు. కేవలం మూడు రోజుల్లో ఐఫోన్11 అవుట్ ఆఫ్ స్టాక్‌గా నిలవడం విశేషం. అయితే ఐఫోన్ 11 ప్రొ అమెజాన్‌లో మాత్రమే అందుబాటులోవుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ (256 జీబీ స్టోరేజ్) వేరియంట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఆవిష్కరించిన ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు దేశీయంగా ఈ నెల 23నుంచి ప్రీ బుకింగులను ఆరంభించగా, ఈ నెల 27నుంచి విక్రయానికి రానున్నసంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment