- ముగిసిన ‘మునిసిపల్’ ప్రచారం
- ఓటర్లను ఆకట్టుకునే పనిలో నేతలు
- {పలోభాలకు గురిచేసేందుకు సిద్ధం
సాక్షి, హన్మకొండ : మునిసి‘పోల్స్’కు ప్రచారం ముగిసింది.. ఇక ఎన్నికలకు మరో 24 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇంతవరకు వినూత్న ప్రచారాలతో ఆకట్టున్న అభ్యర్థులు.. ఇప్పుడు ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. మద్యం, నోట్ల కట్టలను ఎరగా చూపుతూ తమకే ఓటేయాలంటూ ప్రమాణాలు సైతం చేయించుకుంటున్నారు. వార్డును బట్టి.. అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులను బట్టి ఒక్కో ఓటుకు ధర రెండువేల రూపాయల వరకు పలుకుతోంది.
మరికొన్ని చోట్ల యువతను ఆకట్టుకునేందుకు క్రికె ట్ కిట్లను సైతం పంపిణీ చేస్తున్నారు. మహిళా ఓట్ల కోసం చీరలు, స్టీలు సామన్లు పంచేందుకు వెనుకడాడం లేదు. ఇక అన్ని మున్సిపాలిటీల్లో మద్యం షాపుల్లో ఉన్న సరుకంతా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులే కొనుగోలు చేశారు. దీంతో సాధారణంగా మద్యం కొనేందుకు వైన్స్‌కు వెళ్లిన వారికి నో స్టాక్ అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వైన్ షాపుల్లో ఆఫీసర్స్ ఛాయిస్, అరిస్ట్రోక్రాట్ ప్రీ మియం, మెక్‌డోవెల్, ఇంపీరియల్‌బ్లూ వంటి బ్రాండ్లు లభించట్లేదంటే అతిశయోక్తి కాదు.
అంతకంటే ఎక్కువ మేమిస్తాం
జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నగర పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 116 వార్డుల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఐదింటిలో డిమాండ్ ఉన్న వార్డుల్లో ఓటుకు బహిరంగానే కనిష్టంగా రూ. 500 నుంచి రూ. 1000 వరకు పలుకుతోంది. ఈ ముడుపులు చెల్లించే ముందు అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థి ఓటుకు ఎంత ఇస్తున్నాడో ముందుగానే ఆరా తీస్తున్నారు.
ఆ త ర్వాత అంతకు మూడొంతులు ఇస్తామని ఓటరుతో బేరం పెట్టుకుంటున్నారు. కాదు కూడదంటే ఇంకా పెంచేందుకు సిద్ధపడుతున్నారు. ఎటుచేసి ఓటరు మనసును ఎలా కొల్లగొట్టాలనే దానిపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. కాగా, నర్సంపేటలోని 12, 16, 17 వార్డుల్లో, పరకాలలోని 8, 9, 18, 16 వార్డుల్లో, మహబూబాబాద్‌లోని 14, 16 వార్డుల్లో ఓటుకు రెండు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహిళా ఓటర్లకు గాలం
మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ స్థానం మహిళలకు రిజర్వు కావడం తో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఒకటో వార్డులో చీరలు పంపిణీ చేస్తు న్న సీపీఎం నాయకుడిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. అతడి నుంచి పది చీరలు స్వా దీనం చేసుకున్నారు. మరో పద్ధతిలో కుండ గు ర్తు వచ్చిన అభ్యర్థులు అందుకు గుర్తుగా స్టీలు బిందెలు ఇస్తున్నారు. ఉంగరాలు గుర్తు వచ్చిన అభ్యర్థులు రోల్డ్‌గోల్డ్ ఉంగరాలు ఇస్తూ మహి ళా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
చివరి అస్త్రంగా పొన్నాల ప్రచారం
మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగియడంతో టీపీసీసీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య జనగామలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. నర్సంపేటలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మిగిలిన చోట్ల స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ రాలేదు. కాగా, నర్సంపేట నగర పంచాయతీలో 16వ వార్డు టీఆర్‌ఎస్ అభ్యరి జి.రవీందర్ సతీమణి శుక్రవారం ఎస్‌బీహెచ్ నర్సంపేట బ్రాంచ్ నుంచి గోల్డ్‌లోన్ కింద రూ. 12 లక్షలు డ్రా చేశారు.
పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో పోలీసు లు తనిఖీలు చేస్తుండగా, వీరి గుమస్తా వాహ నం దిగి పారిపోవడంతో అనుమానించిన పోలీసులు ఆ సొమ్ము పూర్వపరాలపై విచారణ చేస్తున్నారు. మహబూబాబాద్‌లోని 23 వార్డు లో కాంగ్రె స్ నాయకులు డబ్బు పంపిణీ చేస్తుం డగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 8,000 స్వాధీనం చేసుకున్నారు.