విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు.
విజయవాడ: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. గవర్నర్ కు దుర్గగుడి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతరాలయంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గగుడి పై జరుగుతున్న అభివృద్ధి, పుష్కర ఘాట్ల నమూనాను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నరసింహన్ కు వివరించారు. ఈ సందర్భంగా నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణాపుష్కరాలకి ఇంకా నెలరోజులు మాత్రమే గడువు ఉందని, అందరూ పుష్కరాల్లో సమిష్టిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.