bonam
-
Ashwini Sree : ఎల్లమ్మ తల్లికి బోనమెత్తిన బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
అమ్మవారికి బోనం సమర్పించిన షర్మిల
-
భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం (ఫొటోలు)
-
దుర్గమ్మకు ‘తెలంగాణ’ బోనం (ఫోటోలు)
-
3న దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ జూలై 3న ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనుంది. కమిటీ సభ్యులు బుధవారం విజయవాడలో దుర్గగుడి ఈవో భ్రమరాంబతో సమావేశమై చర్చించారు. కార్యక్రమ వివరాలను ఆలయ ఈవో, ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు. ఈ ఏడాది బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు కమిటీ ప్రతినిధులు ఈవోకు వివరించారు. ఈవోను కలిసిన వారిలో వైస్ చైర్మన్ ఆనందరావు, గాజుల అంజయ్య, మధుసూదన్‌గౌడ్, అన్సరాజ్ తదితరులున్నారు. (చదవండి: అమ్మవారి హుండీల్లో ఫారిన్ కరెన్సీ) -
బోనమెత్తిన ఎమ్మెల్యే
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేటలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బోనమెత్తారు. బుధవారం రాత్రి శ్రీసోమేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బోనాన్ని ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి సమర్పించారు. -
నేడు బల్కంపేట అమ్మవారికి బంగారు బోనం
హైదరాబాద్ : ఆషాఢమాసం బోనాల జాతరను పురస్కరించుకొని ‘భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ’ ఆధ్వర్యంలో మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించనున్నామని కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు. సప్త మాతృకల సప్త బంగారు బోనం పేరుతో నగరంలోని ఏడు దేవాలయాలకు చెందిన అమ్మవార్లకు తొలిసారిగా బంగారు బోనాన్ని సమర్పిస్తున్నామన్నారు. ఈ నెల 15వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించామన్నారు. ఈ నెల 20న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, 24 న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, 26న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, 31న లాల్‌దర్వాజా సింహవాహిణి దేవాలయం, ఆగస్టు 5న మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించనున్నామన్నారు. -
శ్రావణం..భక్తిపారవశ్యం
-
ఊరూరూ బోనమై..
-
బోనం శోభాయమానం
సాక్షి, చార్మినార్: పాతబస్తీ బోనమెత్తింది. పండుగ శోభతో కళకళలాడింది. డప్పు వాద్యాలు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో ఊగిపోయింది. ప్రతి మార్గం యువకుల కేరింతలు, పలహారం బండ్ల ఊరేగింపుతో నిండిపోయింది. ఆదివారం ప్రసిద్ధ లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా నిర్వహించారు. తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు అనంతరం బోనాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. పలువురు ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు. -
బోనం.. వైభోగం..
బోనం అంటే భోజనం అని అర్థం. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలైన పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ ఇలా అమ్మల కన్న అమ్మలకు కుండల్లో పరమాన్నం వండుతారు. తర్వాత కుండలను కుంకుమ, పసుపుతో అలంకరిస్తారు. బోనంపై దీపం, చుట్టూ వేప కొమ్మలు కట్టుతారు. ఇలా గ్రామంలోని మహిళలు అందరూ బోనాలను చేసి, సమూహికంగా గుడికి బయలుదేరుతారు. బోనాల యాత్ర ముందు శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకుంటాయి. డోలు వాయిద్యాలు, గజ్జెల మోత సంబురాన్ని అంబరాన్నంటేలా చేస్తాయి. అమ్మాబైలñ ల్లినాదో... తల్లిబైలెల్లినాదో... అంటూ పాటలు జనాలను భక్తి భావంతో పాటు ఒకింత ఉద్వేగాలకు లోను చేస్తాయి. నియోజకవర్గంలోని ప్రజలు బోనమెత్తారు. గురువారం దహెగాం మండలం ప్రజలు గ్రామ శివారులోని పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. – దహెగాం -
ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్.
-
ఘన టెకీ..బోనమెత్తి..
ఒంటినిండా పసుపు పూసుకుని.. కాళ్లకు గజ్జెలు కట్టుకుని.. జుట్టు అమాంతం వెనక్కి లాగి కట్టి.. నిక్కరు తరహాలో పంచె ఎగ్గట్టి, తనంత ఎత్తున్న కొరడా చేత పట్టి..‘హుహ్హహ్హ’ అని హూంకరిస్తూ.. మెలితిరిగిన మీసాలతో ‘మాయదారి మైసమ్మ’ పాడుతూ చిందులేస్తుంటే.. చూపరులు కళ్లార్పడంమరచిపోయారు. కంప్యూటర్లు తప్ప వీళ్లకేం తెలుసనుకున్న నోళ్లు మూతపడటం మరచిపోయాయి. సిటీలో తొలిసారి సాఫ్ట్వేర్ నిపుణులు బోనాలు థీమ్‌తో ప్రదర్శించిన నృత్యహేల.. ఐటీ సర్కిల్లో హాట్ టాపిక్. ..:: ఎస్.సత్యబాబు/వాంకె శ్రీనివాస్ బోనమెత్తుకు నడిచే మహిళా జన తరంగం.. పోతురాజుల వీ‘రంగం’.. నారీమణి వినిపించే భవిష్యవాణి .. అందులో భాగంగా ఆటలు, పాటలు.. ఇవ న్నీ రాష్ట్ర సంస్కృతిలో భాగం. పొద్దున్న లేస్తే కంప్యూటర్లతో కుస్తీపట్టే నవజనానికి బోన‘భాగ్యాలు’ ఏం తెలుస్తాయ్? అని నిట్టూర్చేవారే ఆశ్చర్యపోయేలా చేశారా సాఫ్ట్వేర్ నిపుణులు. డీఎస్టీ ఇండియా ఉద్యోగుల వార్షిక సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన తెలంగాణ జానపద సంబురాలు.. ఆద్యంతం ఆచార వ్యవహారలపై టెకీలకు ఉన్న ఆసక్తిని కళ్లకుకట్టాయి. ఆధునికత ఒంటబట్టినా.. ఆచారం వెనుకబడదని చాటి చెప్పాయి. నేపథ్యమిదీ.. ఐటీ కంపెనీలు ఈవెంట్స్ నిర్వహించడం మామూలే. పాప్ డ్యాన్సులు, ఫ్యాషన్ షోలు, రాక్‌బ్యాండ్స్, క్విజ్లు, బ్యూటీ కాంటెస్ట్‌లు.. ఈ హడావిడి తెలిసిందే. అయితే ఐటీ ఈవెంట్లో ‘బోనాలు’ భాగం కావడం మాత్రం ఇదే తొలిసారి. దీనికి కారణం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాది ఇది. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి, విదేశీయులకు తమ సంస్కృతీ సంప్రదాయాల్లోని గాఢతను, వాటిపై తమకు ఉన్న గౌరవాన్ని తెలియజెప్పాలి అనుకోవడమే ఈ ఈవెంట్ ఉద్దేశమని నిర్వాహకులు చెప్పారు. జంటనగరాల్లో 1869లో అంటువ్యాధి కారణంగా ఎంతో మంది చనిపోతే.. దానికి అమ్మవారి ఆగ్రహమే కారణమనే నమ్మకం బోనాలు వేడుకకు నాంది పలికించింది. అందుకే అమ్మవారికి ఆగ్రహం రావడం అనే అంశాన్ని నేపథ్యంగా సాగిన సాఫ్ట్వేర్ సందడి ఆకట్టుకుంది. సాగిన విధమిదీ.. సాక్షాత్తూ మహంకాళి అమ్మవారుగా మోనీ ప్రియ ఆగ్రహంతో ఊగిపోతే.. పోతురాజులుగా నర్సింహ, సందీప్‌లు శివాలెత్తారు. పండుగ సంబురాలకు హాజరయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్రలో కిషోర్‌కుమార్ ఒదిగిపోయారు. వీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే.. జంటనగరాల బోనాల సందడిని ప్రతిబింబింపజేయడానికి ఒక లేడీ ఎస్సై పాత్రను సైతం ఒక మహిళా ఉద్యోగి చేత ధరింపజేశారు. సమూహాన్ని నియంత్రించే పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. మరో ఇద్దరు పోలీసులు ఊరేగింపునకు ఎస్కార్ట్‌గా, మరో ఉద్యోగి పురోహితుడిగా మారిపోయారు. మహిళా ఉద్యోగినులు ఇళ్ల దగ్గర భక్తి శ్రద్ధలతో వండి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా ఈ బోనాల సందడి మొత్తం జంటనగరాల్లో జరిగే సిసలైన వేడుకను ప్రతిబింబించింది. మాయదారి మైసమ్మ అంటూ అన్నదమ్ములు నర్సింహ, సందీప్‌లు పోతురాజుల్లా చిందులేస్తుంటే నేపథ్యంలోని డ్రమ్స్ రిథిమ్కు సహచర సిబ్బంది కాలు కలపకుండా ఉండలేకపోయారు. ‘చరిత్రపై పూర్తి అవగాహన లేకున్నా ఆడియో-విజువల్-కమ్-లైవ్ పెర్ఫార్మెన్స్ ద్వారా అచ్చమైన బోనాలకు పట్టం కట్టడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించాం’ అని కంపెనీ ఉద్యోగి మౌనిక చెప్పారు. వాట్సప్‌లో భవిష్యవాణి.. కొరడాలు ఝళిపిస్తూ, నడుముకు ఆకులు చుట్టుకుని డ్రమ్స్ దరువు, డప్పుల మోతలకు అనుగుణంగా చిందేస్తూ అమ్మవారి పాత్రలో మోనిప్రియ భవిష్యవాణి చెబుతున్నప్పుడు.. మన కంపెనీ ఫ్యూచర్ ఏమిటి అని ఒక ఉద్యోగి అడిగితే... వాట్సప్‌లో పంపిస్తానని బదులివ్వడం ఈ థీమ్‌లోని గాంభీర్యం నుంచి ఉపశమనం కలిగించింది. ఈ థీమ్‌ను అనుకున్నప్పుడు కొంచెం గాబరాపడ్డామని, కొరడాలు ఝళిపిస్తూ చిందులేయడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం వంటివి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సాధ్యమేనా అని అనుమానించామని.. అయితే రంగంలోకి దిగిన దగ్గర్నుంచి పోటీపడుతూ ఎవరి పాత్రను వారు రక్తికట్టించడం విశేషమని నిర్వాహకుల్లో ఒకరైన ప్రవీణ్ అంటున్నారు. రేపటి ఆచారానికి నాంది... ఇదొక అద్భుతమైన అనుభవం అని ఈ ఈవెంట్‌కు హాజరైన విదేశీ ప్రతినిధులు వేడ్ ఫ్రీమ్యాన్, గాయ్రీ వెల్స్ చెప్పడం ఈ సందడి ఆకట్టుకున్న తీరుకు ఓ నిదర్శనం. ఈ బోనాల థీమ్‌ని కంపెనీకి చెందిన సీనియర్ ఐటీ అసోసియేట్ లోకేష్ డిజైన్ చేశారు. ‘ఈ థీమ్ కాన్సెప్టులైజేషన్, ఎగ్జిక్యూషనంతా కేవలం మూడు రోజుల్లో పూర్తయింది. దీని కోసం 25 మంది సిబ్బంది విభిన్న అవసరాల రీత్యా పాత్రధారులుగా మారారు’ అని చెప్పారాయన. ఆధునిక వ్యవస్థ కోసం నిన్నటి ఆచారాన్ని కళ్లకు కట్టిన ఈ ఐటీ ఉద్యోగులు ఇకపై సాఫ్ట్వేర్ ప్రాంగణాల్లోనూ బోనాల సందడిని ఒక ఆచారంగా మార్చడానికి నాంది పలికారు. పోతురాజు కథ తెలీదు.. అసలు పోతురాజంటే ఏమిటో, దాని వెనుక ఉన్న క థ ఏమిటో తెలీదు. అలాంటిది సడెన్‌గా నన్ను ఆ పాత్ర పోషించమని అడిగితే... తొలుత ఇబ్బంది పడ్డాను. అయితే లోకేష్ (నిర్వాహక కమిటీ ప్రతినిధి) నాకు వివరించి చెప్పడంతో ఒప్పుకున్నాను. పలు దఫాలు రిహార్సల్స్ తర్వాత ఈవెంట్లో సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాను. - నరసింహ గొప్ప అవకాశం.. పోతురాజు పాత్ర పోషించడం మరువలేని అనుభూతి ఇచ్చింది. ఇదొక గమ్మత్తయిన అనుభూతి. ఈ అవకాశం ఇచ్చిన రిక్రియేషన్ కమిటీకి థ్యాంక్స్. - సందీప్ అంతా అమ్మవారి కృప.. గతంలో నేను పాశ్చాత్య నృత్యాలు ప్రదర్శించాను. అయితే ఎప్పుడూ నాకు సరైన గుర్తింపు లభించలేదు. అమ్మవారిగా ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఈ పాత్ర నేను పోషించడం, దీనికి నలుగురి ప్రశంసలు లభించడం అంతా అమ్మవారి కృపే అనుకుంటున్నాను. - ప్రవల్లిక తమిళం నా భాష.. నా మాతృభాష తమిళం. కుండ తల మీద బ్యాలెన్స్ చేసుకోవడం వంటి ఫీట్లు ఉన్నాయి. భవిష్యవాణి చెప్పేటప్పుడు ఫ్యూచర్ గురించి జనం ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? వాటికి సమాధానాలు ఎలా ఉండాలి? వంటివన్నీ నేను స్వయంగా స్క్రిప్ట్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. పదేళ్లుగా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ఈ పాత్ర తాలూకు అనుభూతి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. - మోనీప్రియ -
భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు
డప్పుల మోతలు, వేపాకులు పట్టుకుని సిగాలు, తలపై బోనాలతో మహిళల ఊరేగింపులు సిద్దిపేటలో ఆదివారం తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించాయి. దీకొండ మైసమ్మ గుడి ప్రారంభమై శతాబ్దం పూర్తయిన నేపథ్యంలో జరిగిన ఉత్సవం భక్తులను తన్మయత్నంలో ముంచేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన కార్యక్రమాల్లో భక్తులు పోటెత్తారు. సంప్రదాయ దుస్తులతో మహిళలు బోన మెత్తుకుని ఊరేగింపు నిర్వహించారు. బైండ్ల కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో వేసిన పట్నాలు ఉత్తేజాన్ని నింపాయి. డప్పుల మోతల మధ్య గావు పట్టే కార్యక్రమం సాగింది. ఉత్సవ సమితి సారథులు తాడూరి శ్రీనివాస్‌గౌడ్, జీ శ్రీనివాస్, ప్రభాకర్ వర్మ, పాల రాజు, బొందుగుల శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్‌ల నేతృత్వంలో జరిగిన వేడుకలు ఉత్కంఠ భరితంగా సాగాయి. సదాశివపేట: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మండలంలోని సిద్దాపూర్, నందికంది గ్రామాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. సిద్దాపూర్లో గ్రామ సర్పంచ్ ఏన లక్ష్మి, ఉప సర్పంచ్ పాతదొడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి గ్రామ పెద్దలు అడివయ్య, గొల్ల మల్లేశం, మున్నుర్ లక్ష్మయ్య, కిష్టయ్య, గొవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి భవాని మాత చిత్ర పటంతో పోతురాజుల నృత్యాలతో ప్రధాన వీదుల గుండా పోచమ్మ, భూ లక్ష్మిదేవి, భవానీ మందిర్, ఊరడమ్మల మందిరాల వరకు వరకు సాగింది. ఊరేగింపు అనంతరం మహిళలు గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకుని దర్శించుకున్నారు. నందికంది గ్రామంలో గొల ్లకురుమ యాదవ సంఘం అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సంగయ్య, కురుమ సంఘం పెద్దల ఆధ్వర్యంలో మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు. భెల్ టౌన్షిప్లో ఘనంగా బోనాలు రామచంద్రాపురం: మండల పరిధిలోని భెల్ టౌన్షిప్ పెద్దమ్మ ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు నెత్తిపై బోనాలు పెట్టుకుని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భెల్ యాజమాన్యం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దెత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టౌన్‌షిప్‌లోని కనకదుర్గ ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ఊరేగింపుతో వస్త్రాలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బెల్ జీఎం, ఆలయ కమిటీ అధ్యక్షుడు యుగేందర్ మాట్లాడుతూ ఇక్కడ మొక్కుకుంటే అమ్మవారు కోరికలు తీరుస్తుందన్న నమ్మకం భక్తుల్లో ఉందన్నారు. ఈ సందర్భంగా భక్తులకు తాగునీరు, ప్రసాదాలు అందించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో భెల్ ఈడీలు రవిచందర్, అరవింద్‌గుప్తా, ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, కార్పొరేటర్ పుష్పనాగేష్ యాదవ్, హ ఫీజ్పేట్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, భెల్ వివిధ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని రామచంద్రరెడ్డినగర్లో బోనాలను ఘనంగా నిర్వహించారు. -
భాగ్యనగరిలో బోనాల సందడి
చారిత్రక నగరిలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. బోనాల జాతరతో భాగ్యనగరం పండుగ కళ సంతరించుకుంది. పాతబస్తీతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. డప్పు వాయిద్యాలు, యువకుల కేరింతలు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల వేడుక అంబరాన్నంటింది. ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపుతో పాత నగరం ఆదివారం మార్మోగింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిణి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బోనాన్ని సమర్పించారు. అలాగే, అక్కన్నమాదన్న లయం, బేలా ముత్యాలమ్మ ఆలయం, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం, సుల్తాన్ షాహి శీతల్‌మాత జగదాంబ మహంకాళి ఆలయం, రాంబక్షి బండ అమ్మవారి ఆలయం తోపాటు మీరాలం మండి, ఉప్పుగూడ, గౌలిపురా, మురాద్ మహాల్లలోని శ్రీమహంకాళి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అంబారీపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు. లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపుట్టు వెంట్రుకలు ఇక్కడే అమ్మవారికి సమర్పించానని, తాను ఇక్కడి సమీపంలోని నల్లగుట్టలోనే పుట్టానన్నారు. మంత్రి గీతారెడ్డి కూడా కూతురు మనుమరాలితో కలిసి వచ్చి మీరంమండి అమ్మవారిని దర్శించుకున్నారు. -
భాగ్యనగరిలో బోనాల సందడి
చారిత్రక నగరిలో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. బోనాల జాతరతో భాగ్యనగరం పండుగ కళ సంతరించుకుంది. పాతబస్తీతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. డప్పు వాయిద్యాలు, యువకుల కేరింతలు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల వేడుక అంబరాన్నంటింది. ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపుతో పాత నగరం ఆదివారం మార్మోగింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిణి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బోనాన్ని సమర్పించారు. అలాగే, అక్కన్నమాదన్న లయం, బేలా ముత్యాలమ్మ ఆలయం, హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం, సుల్తాన్ షాహి శీతల్‌మాత జగదాంబ మహంకాళి ఆలయం, రాంబక్షి బండ అమ్మవారి ఆలయం తోపాటు మీరాలం మండి, ఉప్పుగూడ, గౌలిపురా, మురాద్ మహాల్లలోని శ్రీమహంకాళి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అంబారీపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు. లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపుట్టు వెంట్రుకలు ఇక్కడే అమ్మవారికి సమర్పించానని, తాను ఇక్కడి సమీపంలోని నల్లగుట్టలోనే పుట్టానన్నారు. మంత్రి గీతారెడ్డి కూడా కూతురు మనుమరాలితో కలిసి వచ్చి మీరంమండి అమ్మవారిని దర్శించుకున్నారు. -
బోనం కళాకారుల బతుకు చిత్రం