భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు
Published Mon, Aug 5 2013 5:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
డప్పుల మోతలు, వేపాకులు పట్టుకుని సిగాలు, తలపై బోనాలతో మహిళల ఊరేగింపులు సిద్దిపేటలో ఆదివారం తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించాయి. దీకొండ మైసమ్మ గుడి ప్రారంభమై శతాబ్దం పూర్తయిన నేపథ్యంలో జరిగిన ఉత్సవం భక్తులను తన్మయత్నంలో ముంచేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన కార్యక్రమాల్లో భక్తులు పోటెత్తారు. సంప్రదాయ దుస్తులతో మహిళలు బోన మెత్తుకుని ఊరేగింపు నిర్వహించారు. బైండ్ల కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో వేసిన పట్నాలు ఉత్తేజాన్ని నింపాయి. డప్పుల మోతల మధ్య గావు పట్టే కార్యక్రమం సాగింది. ఉత్సవ సమితి సారథులు తాడూరి శ్రీనివాస్‌గౌడ్, జీ శ్రీనివాస్, ప్రభాకర్ వర్మ, పాల రాజు, బొందుగుల శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్‌ల నేతృత్వంలో జరిగిన వేడుకలు ఉత్కంఠ భరితంగా సాగాయి.
సదాశివపేట: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మండలంలోని సిద్దాపూర్, నందికంది గ్రామాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. సిద్దాపూర్‌లో గ్రామ సర్పంచ్ ఏన లక్ష్మి, ఉప సర్పంచ్ పాతదొడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి గ్రామ పెద్దలు అడివయ్య, గొల్ల మల్లేశం, మున్నుర్ లక్ష్మయ్య, కిష్టయ్య, గొవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి భవాని మాత చిత్ర పటంతో పోతురాజుల నృత్యాలతో ప్రధాన వీదుల గుండా పోచమ్మ, భూ లక్ష్మిదేవి, భవానీ మందిర్, ఊరడమ్మల మందిరాల వరకు వరకు సాగింది. ఊరేగింపు అనంతరం మహిళలు గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకుని దర్శించుకున్నారు. నందికంది గ్రామంలో గొల ్లకురుమ యాదవ సంఘం అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సంగయ్య, కురుమ సంఘం పెద్దల ఆధ్వర్యంలో మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు.
భెల్ టౌన్‌షిప్‌లో ఘనంగా బోనాలు
రామచంద్రాపురం: మండల పరిధిలోని భెల్ టౌన్‌షిప్ పెద్దమ్మ ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు నెత్తిపై బోనాలు పెట్టుకుని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భెల్ యాజమాన్యం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దెత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టౌన్‌షిప్‌లోని కనకదుర్గ ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ఊరేగింపుతో వస్త్రాలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బెల్ జీఎం, ఆలయ కమిటీ అధ్యక్షుడు యుగేందర్ మాట్లాడుతూ ఇక్కడ మొక్కుకుంటే అమ్మవారు కోరికలు తీరుస్తుందన్న నమ్మకం భక్తుల్లో ఉందన్నారు. ఈ సందర్భంగా భక్తులకు తాగునీరు, ప్రసాదాలు అందించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో భెల్ ఈడీలు రవిచందర్, అరవింద్‌గుప్తా, ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, కార్పొరేటర్ పుష్పనాగేష్ యాదవ్, హ ఫీజ్‌పేట్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, భెల్ వివిధ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని రామచంద్రరెడ్డినగర్‌లో బోనాలను ఘనంగా నిర్వహించారు.
Advertisement
Advertisement