దుర్గమ్మను దర్శించుకున్న ఎంఎస్‌కే ప్రసాద్
భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన ఎంఎస్‌కే ప్రసాద్ గురువారం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత తొలి సారిగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన ఎంఎస్‌కే ప్రసాద్ గురువారం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత తొలి సారిగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంఎస్‌కేను వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన విషయాన్ని అమ్మవారికి చెప్పి, ఆశీస్సులు అందించాలని ప్రార్థించానని ఎంఎస్‌కే ప్రసాద్ తెలిపారు. తనకు ఎప్పుడు సంతోషం కలిగినా అమ్మవారి దగ్గరకు వచ్చి దానిని పంచుకుంటానని ఆయన పేర్కొన్నారు.