దుర్గమ్మ సన్నిధిలో డెప్యూటీ సీఎం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
దుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సతీసమేతంగా తరలివచ్చారు. ఆయనకు ఈవో సూర్యకుమారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఉత్సవ ఏర్పాట్లపై డెప్యూటీ సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు.
దుర్గమ్మను దర్శించుకున్న బీసీసీఐ చైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్
దుర్గమ్మను బీసీసీఐ చైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్ బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు.