ఇంద్రకీలాద్రిపై విజయవాడ మేయర్‌కు తీవ్ర అవమానం
పదే పదే కారు నిలిపివేత..దర్శనానికి అనుమతించని పోలీసులు
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై విజయవాడ నగ ర మేయర్‌కు సోమవా రం ఘోర అవమానం ఎదురైంది. కొండపై ఆమెను అడుగడుగునా అధికారులు అవమానించారు. ఆమె కారు ను పదేపదే నిలిపివేశారు. ఆమె కారులోంచి బయటకు వచ్చి తాను మేయర్‌ని అని, తనకు ప్రొటోకాల్ ఉంటుందని చెబుతున్నా ఎవరూ లెక్క చేయలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కష్టాలుపడి కొండపైకి చేరుకున్న ఆమెను ఆలయ చిన్న రాజగోపురం వద్ద పోలీసులు, దేవస్థానం సిబ్బంది నిలిపివేశారు.
దీంతో ఆమె కొద్దిసేపు పక్కనే నిలబడి ఎదురు చూశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న మీడియా ఆమె వద్దకు వచ్చి వీడియో తీస్తుండగా అప్పటికప్పుడు సిబ్బంది స్పందించి గేట్ తీసి ఆమెను లోపలకు పంపించారు. రూ.300 క్యూ లైన్ నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకొని మేయర్ బయటకు వచ్చేశారు. సాధారణంగా మేయర్ వచ్చినప్పుడు ఆమెకు ప్రొటోకాల్ అధి కారులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వాదాలను, ప్రసాదాలను అందించి పంపాల్సి ఉంటుంది.
బీసీ మహిళను అవమానించారు
‘అమ్మవారి దర్శనానికి వస్తే నన్ను అవమానించారు. దేవస్థానం చెప్పిన సమయంలోనే నేను కొండపైకి వచ్చాను.నాకు వెహికల్ పాస్ ఇవ్వమని కలెక్టర్, సీపీ, నగర కమిషనర్‌ను కోరాను. మీరు మేయర్.. మిమ్మల్ని ఎవరు ఆపుతారని అధికారులు అన్నారు. కానీ నాకు అడుగడుగునా అడ్డంకులే. నేను మేయర్‌ని అని అందరికీ చెప్పుకోవాలి్సన పరిస్థితి కల్పించారు. పోలీసులు, దేవస్థానం అధికారుల తీరు సరిగాలేదు. గతంలో ఏనాడైనా ఇలా జరిగిందా..? కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం. నగర పాలకసంస్థ సహకారం లేకుండా భవానీదీక్షలు, దసరా ఉత్సవాలను నిర్వహించగలరా? మేయర్‌ను అందులోనూ బీసీ వర్గానికి చెందిన మహిళను కావాలనే నన్ను అవమానించారు. –రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment