అమ్మవారిని దర్శించుకున్న శాసనమండలి చైర్మన్ | Chairman of the Legislative Council visits the Kanaka durga | Sakshi
Sakshi News home page

అమ్మవారిని దర్శించుకున్న శాసనమండలి చైర్మన్

Published Tue, Oct 4 2016 11:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

Chairman of the Legislative Council visits the Kanaka durga

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని మంగళవారం ఉదయం శాసనమండలి చైర్మన్ చక్రపాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిగా అలంకృతురాలైన దుర్గకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి మండలి సమావేశాలు వెలగపూడిలో శాసనమండలిలోనే జరుగుతాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టసభలు పూర్తిగా సహకరిస్తాయని తెలిపారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని ఆకాంక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement