
సాక్షి, విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రీ సమీపంలో కొండచరియలు బెంబేలెత్తిస్తున్నాయి. కొండమీద మౌనస్వామి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఇటీవల చిన్న చిన్న రాళ్లు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డుపెట్టారు.
రెండు మూడు రోజుల్లో అక్కడి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ అధికారులు ముందే హెచ్చరించారు. అయితే బుధవారమే కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంద్రకీలాద్రికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల అప్రమత్తమై సహాయక చర్యలు వేగవంతం చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగిరమేష్, వసంత కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు.