Indrakiladri hills
-
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి:విరిగిపడిన కొండచరియలు
విజయవాడ: ఇంద్రకీలాద్రి దిగువన కొండచరియలు విరిగిపడ్డాయి. కేశఖండన శాల సమీపంలో ఈ ఘటన జరిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు పడిన ప్రదేశంలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిపడే సమయంలో అక్కడే ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సురేష్ అనే భక్తుడు నిమిషాల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 10 గంటలకు బైక్ పార్కింగ్ చేసి తనతో పాటు వచ్చిన వారితో కేశఖండన శాలకు సురేష్ వెళ్లే క్రమంలో 5 నిమిషాల వ్యవధిలో పెద్ద శబ్ధంతో కొండచరియలు విరిగిపడ్డాయి. కొంచెంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని సురేష్ చెప్పాడు. కొండచరియలను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలను మొదలు పెట్టారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈవో భ్రమరాంబ. ఆలయం ముందు నుంచి వెళ్లే కుమ్మరిపాలెం-రథం సెంటర్ మధ్య రోడ్డును మూసివేశారు. వర్షాలు కొనసాగుతుండటంతో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదసమయంలో భక్తులెవరూ లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదీ చదవండి: కర్ణాటక సర్కార్‌కు ఉచితాల సెగ.. బెంగళూరులో నేడు ప్రైవేట్ వాహనాల బంద్ -
దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది : వైవి సుబ్బారెడ్డి
-
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు
సాక్షి, విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రీ సమీపంలో కొండచరియలు బెంబేలెత్తిస్తున్నాయి. కొండమీద మౌనస్వామి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఇటీవల చిన్న చిన్న రాళ్లు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డుపెట్టారు. రెండు మూడు రోజుల్లో అక్కడి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ అధికారులు ముందే హెచ్చరించారు. అయితే బుధవారమే కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంద్రకీలాద్రికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల అప్రమత్తమై సహాయక చర్యలు వేగవంతం చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగిరమేష్, వసంత కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. -
దుర్గగుడిపై వ్యక్తి హల్చల్
సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : దుర్గగుడిపై మతి స్థిమితం లేని ఓ వ్యక్తి శుక్రవారం హల్చల్ చేశాడు. ఎటువంటి తాడు లేకుండా ప్రమాదకర పరిస్థితులలో చెట్లు, కొండ అంచులను పట్టుకుని పాకుకుంటూ కొండపైకి చేరుకున్నాడు. మతి స్థిమితం లేని వ్యక్తి చేస్తున్న చర్యలను చూసి పోలీసులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది, భక్తులకు ముచ్చెమటలు పట్టాయి. చివరకు ఆ వ్యక్తి క్షేమంగా కొండపైకి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగ్గయ్యపేట మండలం మర్రిపాకకు చెందిన కుండల నాగేశ్వరరావు కొద్ది రోజుల కిందట లారీ ఎక్కి నగరానికి చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మహా మండపం సమీపంలోని పాత మెట్ల వద్దకు చేరుకున్న నాగేశ్వరరావు కొండపైకి చేరుకోవాలని బావించాడు. మెట్ల మార్గం నుంచి కాకుండా పక్కనే ఉన్న రాళ్లు, చెట్ల మధ్య నుంచి కొండపైకి ఎక్కడం ప్రారంభించాడు. సుమారు అరగంట తర్వాత కొండ సగం దూరం ఎక్కిన నాగేశ్వరరావు కిందకు చూసే సరికి భయం వేసింది. అయినా సరే కొండ రాళ్లు అంచులను పట్టుకుని మెల్లగా పాకుకుంటూ పైకి ఎక్కడం ప్రారంభించాడు. కొంత దూరం ఎక్కిన తర్వాత భయంతో కొండ అంచున కూర్చోవడంతో అతనిని భక్తులు గమనించారు. అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు సిబ్బంది, ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది కొంత మంది కొండ కింద నుంచి, మరి కొంత మంది పై నుంచి నాగేశ్వరరావును పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎక్కడ పట్టుతప్పి కింద పడిపోతాడోనని భయంతో తాడు సహాయంతో పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇంతలో శానిటేషన్ విభాగంలో పనిచేసే ఓ యువకుడు తాడుతో కిందకు దిగి అతనిని పట్టుకుని పైకి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత నాగేశ్వరరావును పోలీసులకు అప్పగించారు. అవుట్ పోస్టులోకి తీసుకువెళ్లగా నాగేశ్వరరావు తన పూర్తి వివరాలను తెలిపాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు. తన మేకలు కొండపైన ఉన్నాయని, వాటిని పట్టుకునేందుకు వచ్చానని పొంతన లేని సమాధానాలు చెప్పసాగాడు. అతనిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
భక్తులకు మెరుగైన సేవలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం) : దుర్గమ్మ దర్శనంలో భక్తులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనతో చెప్పవచ్చని ఈవో వి.కోటేశ్వరమ్మ చెప్పారు. మహా మండపం సమీపంలోని చాంబర్లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలుత అర్జున వీధి మీదుగా మహా మండపానికి చేరుకున్న ఆమెకు ఏఈవో అచ్యుతరామయ్య, పలువురు పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. మెట్ల మార్గం ద్వారా నేరుగా మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. పాలక మండలి సభ్యులు ఈవో కోటేశ్వరమ్మకు పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో విలేకర్లతో మాట్లాడుతూ భక్తులకు మంచి దర్శనం, మెరుగైన సేవలే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని తెలిపారు. అమ్మ దర్శనానికి వచ్చిన భక్తులందరూ దుర్గమ్మ బిడ్డలేనని పేర్కొన్నారు. భక్తులకు అమ్మవారి చక్కటి దర్శనంతో పాటు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అర్చకులు , ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేస్తానని వెల్లడించారు. ఎటువంటి విభేదాలకు తావు ఇవ్వకుండా పని చేయడమే ప్రధాన కర్తవ్యమన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ , వారి ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తానని వివరించారు. ఇక దాతల సౌకర్యార్ధం టీటీడీ తరహాలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల మనోబావాలు దెబ్బతిసేలా కొంత మంది ఆలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారని, దీని వల్ల తరుచూ అనేక గొడవలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. త్వరలోనే ఆలయ సిబ్బంది అందరితో ఓ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల పట్ల గౌరవంగా మెలగాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. ఇక దేవస్థానంలో జరుగుతున్న వివాదాలను ఇకపై జరగకుండా ప్రతి చోటా చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ విభాగాల అధికారులు కోటేశ్వరమ్మను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, పాలక మండలి సభ్యులు పెంచలయ్య, శంకరబాబు, పద్మశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపైకి దేవస్థానం బస్సులకే అనుమతి
హైదరాబాద్: విజయవాడలో ఎడతేరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు.. ఇంద్రకీలాద్రిపై నుంచి భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకునే ఘాట్‌రోడ్డులో భక్తుల రాకపోకలను ఆలయ అధికారులు నిలిపివేశారు. కేవలం దేవస్థానం బస్సులను మాత్రమే ఘాట్‌రోడ్డులో ప్రయాణించేందుకు ఆలయ అధికారులు అనుమతించారు. కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే పడి ఉన్న కొండ చరియలను సిబ్బంది సహాయంతో ఆలయ అధికారులు ఘాట్ రోడ్డులో నుంచి తొలగిస్తున్నారు.