విజయవాడ: ఇంద్రకీలాద్రి దిగువన కొండచరియలు విరిగిపడ్డాయి. కేశఖండన శాల సమీపంలో ఈ ఘటన జరిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు పడిన ప్రదేశంలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి.
కొండచరియలు విరిగిపడే సమయంలో అక్కడే ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సురేష్ అనే భక్తుడు నిమిషాల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 10 గంటలకు బైక్ పార్కింగ్ చేసి తనతో పాటు వచ్చిన వారితో కేశఖండన శాలకు సురేష్ వెళ్లే క్రమంలో 5 నిమిషాల వ్యవధిలో పెద్ద శబ్ధంతో కొండచరియలు విరిగిపడ్డాయి. కొంచెంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని సురేష్ చెప్పాడు.
కొండచరియలను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలను మొదలు పెట్టారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈవో భ్రమరాంబ. ఆలయం ముందు నుంచి వెళ్లే కుమ్మరిపాలెం-రథం సెంటర్ మధ్య రోడ్డును మూసివేశారు. వర్షాలు కొనసాగుతుండటంతో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదసమయంలో భక్తులెవరూ లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి: కర్ణాటక సర్కార్‌కు ఉచితాల సెగ.. బెంగళూరులో నేడు ప్రైవేట్ వాహనాల బంద్
Comments
Please login to add a commentAdd a comment