cliffs
-
ఇంద్రకీలాద్రి:విరిగిపడిన కొండచరియలు
విజయవాడ: ఇంద్రకీలాద్రి దిగువన కొండచరియలు విరిగిపడ్డాయి. కేశఖండన శాల సమీపంలో ఈ ఘటన జరిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు పడిన ప్రదేశంలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిపడే సమయంలో అక్కడే ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సురేష్ అనే భక్తుడు నిమిషాల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 10 గంటలకు బైక్ పార్కింగ్ చేసి తనతో పాటు వచ్చిన వారితో కేశఖండన శాలకు సురేష్ వెళ్లే క్రమంలో 5 నిమిషాల వ్యవధిలో పెద్ద శబ్ధంతో కొండచరియలు విరిగిపడ్డాయి. కొంచెంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని సురేష్ చెప్పాడు. కొండచరియలను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలను మొదలు పెట్టారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈవో భ్రమరాంబ. ఆలయం ముందు నుంచి వెళ్లే కుమ్మరిపాలెం-రథం సెంటర్ మధ్య రోడ్డును మూసివేశారు. వర్షాలు కొనసాగుతుండటంతో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదసమయంలో భక్తులెవరూ లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదీ చదవండి: కర్ణాటక సర్కార్కు ఉచితాల సెగ.. బెంగళూరులో నేడు ప్రైవేట్ వాహనాల బంద్ -
యాదాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు
యాదగిరిగుట్ట: భారీ వర్షాల కారణంగా గురువారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్రోడ్డులోని రెండో మూలమలుపు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వర్షానికి మరిన్ని బండరాళ్లు పడే అవకాశం ఉందని వాహనాలను మొదటి ఘాట్ రోడ్డు గుండా మళ్లించారు. తర్వాత ఆర్అండ్బీ అధికారులు రోడ్డుపై ఉన్న బండరాళ్లను జేసీబీతో తొలగించారు. ఇదిలా ఉండగా వర్షం కారణంగా బాలాలయ ఆవరణలో గతంలో వేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. కొండపై నూతనంగా నిర్మించిన క్యూలైన్లల్లోకి వర్షపు నీరు చేరింది. కాగా, కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు వర్షం కారణంగా నిలిచిపోయాయి. -
ఫోటోషూట్: నిజమైతే వీళ్లంత మూర్ఖులు ఉండరు..
సెల్ఫీలు, ఫోటోలపై జనాలకు మోజు ఎక్కువైపోతుంది. ఎక్కడికి వెళ్లానా అక్కడ జ్ఞాపకంగా ఓ ఫోటో తీసుకోవడం అలవాటైపోయింది. ఈ మధ్య కాలంలో ఫేమస్ అవ్వడం కోసం పాకులాడుతూ ప్రమాదకరమైన ప్రదేశాల్లో చిత్ర విచిత్ర ఫోజుల్లో ఫోటోలు దిగుతూ జీవితాన్ని ఇరకాటంలో పడేసుకుంటున్నారు. సెల్ఫీల కారణంగా అనేకమంది ప్రాణాలు బలైపోయిన ఎన్నో సంఘటనలు మన కళ్ల ముందుకు వస్తూనే ఉన్నాయి. అయిప్పటికీ మనుషుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఓ దృశ్యమే వెలుగులోకి వచ్చింది. ఫోటోషూట్లో భాగంగా ఓ జంట ఎత్తైన కొండ అంచు భాగంపై ఫోటో దిగిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటోలో అమ్మాయి కొండపై నిలబడి.. కొండ అంచుపై భాగంలో ఒక కాలు పెట్టి మరో కాలు గాలిలో ఉంచి నిలబడిన వ్యక్తి చేతిని తను పట్టుకున్నట్లు కనిపిస్తోంది. కింద చాలా దూరంలో ఓ రహదారి తప్ప ఏం కినిపించడం లేదు. ‘ఇలా చేయకుండా మిమ్మల్ని ఆపేదెవరు’ అంటూ ఓ ట్విటర్ యూజర్ దీనిని షేర్ చేశారు. కానీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు. ఈ పోస్టును ఇప్పటికే 5 వేల మంది లైక్ చేయగా వేల మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫోటో వాస్తవమేనా లేక ఫోటోషాప్ పనితనమా అని నెటిజనులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజమే అయితే ఫోట్ షూట్ కోసం ఇంకింత జ్ఞానం లేకుండా ఇలా చేస్తారా అని, ఈ జంట అంతా పిచ్చోళ్లు మరెవరూ ఉండరని మండిపడుతున్నారు. అయితే కెమెరా కోణం వల్ల మాత్రమే ఫోటో ప్రమాదకరంగా కనిపిస్తోందని మరికొంత మంది వాదిస్తున్నారు. చదవండి: షాకింగ్: నటికి సర్జరీ మిస్ఫైర్ కావడంతో చదవండి: ఒక్కసారిగా పాములన్నీ మీద పడ్డాయి! Whats stopping you from doing this? pic.twitter.com/XwSBJScSrU — Shreela Roy (@sredits) February 2, 2021 -
స్వరం వినిపించాలి బలం నిరూపించాలి
మహిళలు బయటికి రావాలి, వాళ్లు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి అని చాలామంది సందేశాలు ఇస్తుంటారు. అయినా కూడా ఇప్పటికీ మనదేశంలో చీకట్లోనే మగ్గుతోన్న స్త్రీలు చాలామంది ఎందుకున్నట్టు! ఎందుకంటే... మాటలు చెప్పే ఎవరూ వారికి చేయూతనివ్వరు. నువ్విది చేయగలవు అంటూ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయరు. ఇలా చెయ్యి అంటూ దారి చూపించాలని అనుకోరు. జాతీయాదాలను లెక్కలేసి, ఎగుమతి దిగుమతులను విదేశీ మారకద్రవ్యాలను అంచనాలు వేసి అభివృద్ధిని కొలవడం నా దృష్టిలో సరికాదు. అసలు ఓ దేశపు అభివృద్ధి ఈ విషయాల మీద కాదు ఆధారపడి ఉండేది. ఏ దేశంలో మహిళల స్థితిగతులు బాగుంటాయో, ఏ దేశంలో మహిళలు చైతన్యవంతులుగా ఉంటారో... ఆ దేశం నిజంగా అభివృద్ధి పథంలో సాగుతున్నట్టు లెక్క. నిజానికి ఇప్పటి మహిళలకు తెలివితేటలు ఉన్నాయి. సాధించే తెగువ, ముందడుగు వేసే తెగింపు ఉన్నాయి. కానీ ఎన్నో అవరోధాలు వాళ్ల కాళ్లకు బంధనాలు వేస్తున్నాయి. ప్రోత్సహించడం సంగతి తర్వాత, నువ్వు చేయలేవు అంటూ నిరుత్సాహపర్చి వెనక్కి లాగేసేవాళ్లు అడుగడుగునా అడ్డుపడుతుంటే ఏ మహిళ అయినా ఎలా ముందుకు సాగుతుంది! మన మహిళలు విజయం సాధించాలంటే వారికి కావలసింది కాస్తంత ప్రోత్సాహం. అదే దొరికిననాడు మహిళలు ఈ సమాజాన్నే మార్చేయగలరు. రాజకీయాలను సైతం మలుపు తిప్పగలరు. ఉన్నత పదవులను అలంకరించగలరు. అభివృద్ధి అనేదానికి అసలైన నిర్వచనాన్ని ఇవ్వగలరు. కాబట్టి మాటలు కాదు, మనకి చేతలు కావాలి. చెప్పి ఊరుకోవడం కాదు, చేసే దిశగా వారిని నడిపించాలి. అప్పుడు ఏ మహిళా వంటింటికి పరిమితమైపోదు. కట్టుబాట్లకు తలవంచి నిస్సహాయంగా మిగిలిపోదు. తన స్వరం బలంగా వినిపిస్తుంది. తన బలం నిజంగా నిరూపిస్తుంది. - షబానా అజ్మీ, నటి, సంఘ సేవకురాలు