Crazy Photoshoot: Young Couple Poses For A Photo On Cliff's Edge - Sakshi
Sakshi News home page

ఫోటోషూట్‌: నిజమైతే వీళ్లంత పిచ్చోళ్లు మరొకరుండరు

Published Fri, Feb 5 2021 3:44 PM | Last Updated on Fri, Feb 5 2021 7:41 PM

Viral Picture: Couple Poses On Cliffs Edge, Netizens Baffled - Sakshi

సెల్ఫీలు, ఫోటోలపై జనాలకు మోజు ఎక్కువైపోతుంది. ఎక్కడికి వెళ్లానా అక్కడ జ్ఞాపకంగా ఓ ఫోటో తీసుకోవడం అలవాటైపోయింది. ఈ మధ్య కాలంలో ఫేమస్‌ అవ్వడం కోసం పాకులాడుతూ ప్రమాదకరమైన ప్రదేశాల్లో చిత్ర విచిత్ర ఫోజుల్లో ఫోటోలు దిగుతూ జీవితాన్ని ఇరకాటంలో పడేసుకుంటున్నారు. సెల్ఫీల కారణంగా అనేకమంది ప్రాణాలు బలైపోయిన ఎన్నో సంఘటనలు మన కళ్ల ముందుకు వస్తూనే ఉన్నాయి. అయిప్పటికీ మనుషుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఓ దృశ్యమే వెలుగులోకి వచ్చింది. ఫోటోషూట్‌లో భాగంగా ఓ జంట ఎత్తైన కొండ అంచు భాగంపై ఫోటో దిగిన దృశ్యం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫోటోలో అమ్మాయి కొండపై నిలబడి.. కొండ అంచుపై భాగంలో ఒక కాలు పెట్టి మరో కాలు గాలిలో ఉంచి నిలబడిన వ్యక్తి చేతిని తను పట్టుకున్నట్లు కనిపిస్తోంది. కింద చాలా దూరంలో ఓ రహదారి తప్ప ఏం కినిపించడం లేదు. ‘ఇలా చేయకుండా మిమ్మల్ని ఆపేదెవరు’ అంటూ ఓ ట్విటర్‌ యూజర్‌ దీనిని షేర్‌ చేశారు. కానీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు. ఈ పోస్టును ఇప్పటికే 5 వేల మంది లైక్‌ చేయగా వేల మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫోటో వాస్తవమేనా లేక ఫోటోషాప్‌ పనితనమా అని నెటిజనులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజమే అయితే ఫోట్‌ షూట్‌ కోసం ఇంకింత జ్ఞానం లేకుండా ఇలా చేస్తారా అని, ఈ జంట అంతా పిచ్చోళ్లు మరెవరూ ఉండరని మండిపడుతున్నారు. అయితే కెమెరా కోణం వల్ల మాత్రమే ఫోటో ప్రమాదకరంగా కనిపిస్తోందని మరికొంత మంది వాదిస్తున్నారు.
చదవండి: షాకింగ్‌: నటికి సర్జరీ మిస్‌ఫైర్‌ కావడంతో
చదవండి: 
ఒక్కసారిగా పాములన్నీ మీద పడ్డాయి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement