యాదగిరిగుట్ట: భారీ వర్షాల కారణంగా గురువారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డులోని రెండో మూలమలుపు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వర్షానికి మరిన్ని బండరాళ్లు పడే అవకాశం ఉందని వాహనాలను మొదటి ఘాట్ రోడ్డు గుండా మళ్లించారు.
తర్వాత ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డుపై ఉన్న బండరాళ్లను జేసీబీతో తొలగించారు. ఇదిలా ఉండగా వర్షం కారణంగా బాలాలయ ఆవరణలో గతంలో వేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. కొండపై నూతనంగా నిర్మించిన క్యూలైన్లల్లోకి వర్షపు నీరు చేరింది. కాగా, కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు వర్షం కారణంగా నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment