ruined
-
ఇంద్రకీలాద్రి:విరిగిపడిన కొండచరియలు
విజయవాడ: ఇంద్రకీలాద్రి దిగువన కొండచరియలు విరిగిపడ్డాయి. కేశఖండన శాల సమీపంలో ఈ ఘటన జరిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు పడిన ప్రదేశంలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిపడే సమయంలో అక్కడే ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సురేష్ అనే భక్తుడు నిమిషాల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 10 గంటలకు బైక్ పార్కింగ్ చేసి తనతో పాటు వచ్చిన వారితో కేశఖండన శాలకు సురేష్ వెళ్లే క్రమంలో 5 నిమిషాల వ్యవధిలో పెద్ద శబ్ధంతో కొండచరియలు విరిగిపడ్డాయి. కొంచెంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని సురేష్ చెప్పాడు. కొండచరియలను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలను మొదలు పెట్టారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈవో భ్రమరాంబ. ఆలయం ముందు నుంచి వెళ్లే కుమ్మరిపాలెం-రథం సెంటర్ మధ్య రోడ్డును మూసివేశారు. వర్షాలు కొనసాగుతుండటంతో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదసమయంలో భక్తులెవరూ లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదీ చదవండి: కర్ణాటక సర్కార్‌కు ఉచితాల సెగ.. బెంగళూరులో నేడు ప్రైవేట్ వాహనాల బంద్ -
పక్కింటి స్నేహం
అది నిద్రో తెలీదు. మెలకువో తెలీదు. రాత్రుళ్ళు నిద్ర పడుతుందో! లేదో! కూడా తెలీదు. ఎప్పుడు మెలకువ వచ్చినా.. అసలు నేను ఇప్పటి వరకూ నిద్రపోయానా! లేక మెలకువగానే ఉన్నానా! అనిపించేలా ఉంటుంది. ఆ రోజూ అంతే. నిద్ర కోసం అలసి సొలసి వేకువజామున చల్లగాలికి మాగన్ను పడుతుంటే.. ఆ ప్రశాంతతని భగ్నం చేస్తూ ఏదో చప్పుడు. హోరుమంటూ అదే పనిగా వినవస్తున్న చప్పుడు. ఆ గందరగోళానికి బాగా దగ్గరలోనే ఉన్నట్లు ఉన్నా.. కళ్ళు తెరవలేని అశక్తత. నిద్రమత్తుని బలవంతంగా పక్కకు నెట్టి, మెలకువ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ చప్పుడు అలాగే వినవస్తోంది. జలజలమంటూ ఒకే శబ్దంతో హోరున పడుతున్నాయి. అది అంతకంతకూ భరించలేనట్లుగా తయారయ్యింది. ఎవరో నీళ్ళ పంపు వదిలేసినట్లున్నారు.అది పక్క ఇంటి ముసలమ్మగారి పనే. పదేళ్ళ పైనుంచీ ఒక్కతే ఉంటోంది. కొడుకో చోట, తనో చోట. కొడుకూ ఒంటికాయ సొంటికొమ్మే. నలభై అయిదేళ్ళు వచ్చేసినయ్యి. ఇంకా పెళ్లి లేదు. ముసలమ్మ కొడుకుని ఒప్పించలేక ‘‘మా అబ్బాయికి అస్సలు తీరిక ఉండదు. అస్తమానం సింగపూరు, వైజాగ్, హైదరాబాదు అంటూ ఊళ్లు తిరుగుతూ ఉంటాడు. అక్కడ సొంతంగా కంపెనీలు ఉన్నాయి. అయినా మాలో లేట్ మారేజెస్ తప్పు కాదు లెండి’’ అని చెబుతుంది ముసలమ్మ, కోడలోచ్చి, అత్తగారిగా సుఖపడాల్సిన వయస్సులో కూడా. స్థిరంగా ఉండలేని కొడుకు దగ్గర ఉండలేక, సొంత ఫ్లాటులోనే ఉండిపోతుంది. ఆ పంపు కింద బకెట్టు అయినా వెయ్యదు. అలా నీళ్ళు వదిలేసి, ఉదయాన్నే ఇంటి చుట్టూరా ఉన్న బాల్కనీ కడుక్కుంటూ వస్తుంది. నిజానికి పనిచేసుకునే తీరు చూస్తే.. ఇంటిలో ఓ బకెట్టు కూడా ఉండి ఉండదన్న అనుమానం నాకు.ఓసారి అననే అన్నా, ‘‘ఆ పంపు కింద ఓ బకెట్టు వెయ్యొచ్చు కదా. అన్ని నీళ్ళు పోతున్నాయి’’ అని. అసలే నా గొంతులో కరుకుదనం ఎక్కువ. అది బయట పడకుండా లేని నవ్వును నటిస్తూ, ఎక్కడ గట్టిగా మాట్లాడితే పక్కనున్న వాళ్లతో స్నేహం దెబ్బతింటుందేమోనన్న అనుమానం పీడిస్తుండగా. ఆఫీసులో అయితే ఆ బాధలేదు. మాట్లాడాలనుకున్నదేదో నిర్మొహమాటంగా మాట్లాడేస్తా. అవసరం అయితే, పోట్లాడడానికైనా వెనుకాడం. ఏదైనా అప్పటికప్పుడే. మరునిమిషం మామూలే. ఏదీ మనసుకు హత్తుకోదు. హత్తుకున్నా కాలం గాయాన్ని మాన్పేస్తుంది. ట్రాన్స్ఫర్లలో పాత నీరు పోయి, కొత్త నీరు వస్తుంది. కొత్త మనుషులు.. కొత్త ప్రపంచం.కానీ, బయట ప్రపంచంలో, అందునా పక్కనున్న వాళ్లతో చాలా జాగ్రతగా ఉండాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్లు, కొత్త పరిస్థితుల రాకా ఉండదు. ఏదైనా జరిగితే డోర్ మూసుకుపోయినట్లే. ఆ మాటకు తుడుస్తున్న తుడుపు ఆపి ‘‘నేను ఇక్కడే ఉన్నాను కదా. పని చేసుకుంటూనే ఉన్నాను కదా’’ అంటూ అసహనంగా నాకోసం అన్నట్లు పంపుని కాస్త కట్టి, వదిలేసింది. అయినా నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఇక నాకేం మాట్లాడాలో తెలీలేదు. గట్టిగా మాట్లాడిన దాకా ఉంటే ‘మీరు నలుగురున్న మనుషులు.. మీకన్నా ఎక్కువ నీళ్ళు వాడేస్తానా..’ అంటేనో! దానికి నా దగ్గర సమాధానం లేదు. అనవసరంగా మాట్లాడి స్నేహం పోగొట్టుకోవడం ఎందుకు? పక్కింటి వాళ్లతో స్నేహం డబ్బిచ్చి కొనుక్కోలేం.అయితే.. ఇప్పుడు ఆ నీటి ధార చేసే చప్పుడు. నన్ను పడుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతోంది. పూర్తిగా మెలకువ వచ్చిన తరువాత.. ఎంతోసేపు ఉండలేకపోయాను. ఇంకా ఊరుకుంటే, పైన ట్యాంకులో నీళ్ళు అయిపోయే ప్రమాదం ఉంది. లేచి, వంటగది కిటికీ దగ్గరకు వెళ్లి.. పక్కింటి బాల్కనీ వైపు చూశాను. పంపు ఆసాంతం విప్పి ఉంది. నీళ్ళు ధారగా పోతున్నాయి. ఆవిడ ఇక్కడ పని మొదలుపెట్టి, ఇంట్లోకి వెళ్లి, మరో పని చూసుకుంటున్నట్లు ఉంటుంది కాబోలు.. పంపు అలాగే పడుతోంది.‘‘ఏమండీ. నీళ్ళు పోతున్నాయి కదా’’ గట్టిగా పిలిచాను ముసలమ్మగార్ని.దరిదాపుల్లో ఉన్నట్లు లేదు. చడీ చప్పుడూలేదు. ఉలుకూ పలుకూ లేదు.రెండు నిమిషాలు చూసి, ‘‘ఏమండీ! రమణమ్మ గారూ’’ మరింత గట్టిగా స్వరం పెంచాను. నా అరుపుకి హడావుడిగా బయటకొచ్చిన ముసలమ్మ పంపుని గట్టిగా కట్టి ‘‘నాకు తెలుసండీ. అస్తమానంనాకేం చెప్పాల్సిన పనిలేదు. నేనేం చిన్న పిల్లనా!’’ అంది.‘‘నీళ్లు పోతున్నాయి కదా..’’ మాట ఇంకా గొంతులో ఉండగానే.. ‘‘మీరింకేం మాట్లాడ కండి. నా సంగతి నాకు తెలుసు’’ అంటూ, చీపురుతో బాల్కనీ తుడుస్తూ, ‘‘తెల్లారింది మొదలు ఇవే మాటలు అయిపోయినాయ్. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా’’ అంటూ తప్పు తనది పెట్టుకుని కూడా సణుక్కోసాగింది.పొద్దుటే, ఏం మాట్లాడాలో తోచింది కాదు.ఆమెలో ఎప్పుడూ ఇలాంటి ధోరణి చూసింది లేదు. అవాక్కయ్యాను. నిద్ర లేచిన వెంటనే, గొడవకు దిగితే, ఇక రోజు ఏం ప్రశాంతంగా ఉంటుంది. మౌనంగా ఉండిపోయాను. ఇన్నాళ్లూ అభిమానంగా ‘‘ఇంట్లో పూజ చేసుకున్నాను. వచ్చి తాంబూలం తీసుకునెళ్ళండమ్మా’’ అన్న ముసలమ్మగారేనా ఈవిడ. తన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ఈ విధంగా మాట్లాడేస్తోంది.పిలిచిందే తడవుగా.. ఇంట్లోకి వెళ్లి, దేవుడికి దండం పెట్టుకుని, అక్కడే ప్లేటులో ఆవిడ అమర్చిపెట్టిన పసుపూ, కుంకుమా, వాయనం అన్నీ తీసుకుని, చివరిగా ఆవిడ అందించే ప్రసాదం తీసుకుని, వస్తుంటాం.ఇక ఆ భాగ్యానికి నేను నోచుకోనేమో అనిపించింది ఆ క్షణాన. ఇంతటితో మా పదేళ్ళ స్నేహానికి అడ్డుకట్ట పడిందా! అపార్టుమెంటులో ఉన్న జబ్బే ఇది.వేసవికాలం అయినా పైపులు అలా వదిలేసి, ఇస్టానుసారంగా నీళ్ళు వాడేస్తారు. రెండు బోర్లు తవ్వించారు. ఒకటి పోయినా ఒకటి ఉంటుందని.మంచినీళ్ళకి మున్సిపల్ వాటర్ ఎలాగూ ఉంది. మంచినీళ్ళు రాకపోవడం అంటూ ఉండదు. ఎటొచ్చీ వాడకం నీటికే జాగ్రత్త.పేపర్లు, టీవీలు అదే పనిగా ఘోషించి, నీటి ఎద్దడిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా గాని, అవన్నీ ఎక్కడో కదా అన్నట్లు చూస్తారే తప్ప.. వాస్తవాన్ని గ్రహించలేరు. ఈరోజు సుఖంగా గడిస్తే చాలు.. రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకునే నైజం.ఏదో ఓ రోజున బోర్లలో ఉండే భూగర్భజలం అడుగంటుకుపోయి, ఆ వచ్చే కాసిన్ని చుక్కలూ రాకుండా పోతాయి. నీళ్ళు తోడే మోటారు అస్తమానం తోడలేక, తోడి తోడి ఐదో అంతస్తుపైన ఉన్న వాటర్ ట్యాంకులోకి ఎక్కించలేక.. అప్పుడప్పుడూ మొరాయిస్తుంది. అదీ వేసవిలోనే. వెంటనే బాగు చేయిద్దాం అన్నా, సమయానికి మెకానిక్ దొరకడు. తక్కువలో తక్కువ రెండు రోజులు పడుతుంది. అయిదు అంతస్తులు కిందికి దిగి, వీధి కుళాయిల దగ్గర పట్టుకోవాలి. ముప్పై పోర్షన్ల వాళ్ళూ ఓ రోజు బిందెలు పట్టుకుని కిందకి దిగితే, సాయంత్రానికల్లా లిఫ్ట్ పాడైపోతుంది. అది ఇంకా నరకం. బిందె, బిందెకూ వంద మెట్లెక్కి దిగాలి. ఎవ్వరికీ.. రాబోయే కష్టం గురించి ఆలోచన లేదు. అలాంటి పరిస్థితి రాకూడదనే మాట్లాడినందుకు పక్కింటి స్నేహానికి ఎసరొచ్చింది. ఏం చేస్తాం? ఇంతకు ఇంతే ప్రాప్తం అని సరిపెట్టేసుకున్నా. నాకు ఇల్లే కాదు ఆఫీసు అనే మరో ప్రపంచం కూడా ఉంది. కాబట్టి, విషయం అంతగా పట్టించుకోలేదు. ఈ వేసవికి ముసలమ్మగారింటికి పెంపుడు కూతురు పిల్లలతో సహా వచ్చింది. ఆవిడకీ ఒంటరితనానికి తెర పడింది. మా చూపులు పలకరించుకోవడం పూర్తిగా మానేశాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే అనుకుంటున్నాం, ఈసారి ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి అంటూ. శెలవు రోజుల్లో ఇంట్లో ఉండాల్సి వస్తే మాత్రం చాలా కష్టం అయిపోయింది. ఆకాశంలో.. అయిదవ అంతస్తు. ఎండా, వేడీ అంతా ఇంట్లోనే. ఉదయం పది గంటలయితే చాలు వడగాడ్పు మొదలు. తలుపులు ఓ వారగా వేసుకుని, గాడ్పు నుండి ఉపశమనం పొందడం. గదిలో ఫ్యానులు ఆగకుండా తిరిగేవి. అయినా ఉక్కబోత. ముఖం మీద చర్మం కాలిపోతుందన్న భావన. ఎన్ని మంచినీళ్ళు తాగినా దాహం తీరదు. ఒక్కచోట కూర్చోలేని అనిశ్చితి. ఉస్సూరస్సూరంటూ రోజు గడిచేది. అలాంటి వేసవిలో ఆరోజు..ఆఫీసుకి వెళ్ళే తొందరలో వంటగదిలో సింకు దగ్గర పని చేసుకుంటున్నాను. అక్కడ నిలబడి ఎదురు బాల్కనీలోకి చూస్తే ముసలమ్మగారు ఏం పని చెసుకుంటున్నదీ కనిపిస్తుంది. అలాగే పైపులు వదిలేసినా తెలుస్తుంది. కాబట్టే, నేనావిడని కట్టడి చేసేది. అలా జరిగినప్పటి నుంచీ, ఆవిడ జాగ్రత్తగానే ఉంది, నీటి వాడకం విషయంలో. ఏమనుకుందో ముసలమ్మగారు.. ఎప్పటిలాగే మా వంటగది కిటికీ ఎదురుగా నిలబడి, కిటికీలోకి తొంగి చూస్తూ.. నన్ను ఉద్దేశించి కాస్త గట్టిగా ‘‘ఎండలు మండిపోతున్నాయండీ. అస్సలు ఉండలేకపోతున్నాము. మీకెలా ఉందో గాని, నేనైతేతట్టుకోలేకపోతున్నాను’’ అంటూ నోరు విప్పి మాట్లాడింది, నెల రోజుల తరువాత. హమ్మయ్యా! ఇన్నాళ్ళకు గ్రహణం వీడింది.ముసలమ్మగారు నాతో మాట్లాడుతోంది. చాలా సంతోషమేసింది. అపార్థాల మంచుతెరలు తొలగి, పిల్లతెమ్మెర వీచినట్లు. ‘‘అవునండీ. అస్సలు భరించలేకుండా ఉన్నాం. నేనైతే ఆఫీసులో ఎక్కువసేపు కంప్యూటర్లు ఉన్న ఏసీ రూంలోనే కూర్చుంటున్నాను. నా సీటు పని కూడా అక్కడేతీసుకువెళ్ళి చేసుకుంటున్నాను. ఎప్పుడోగాని బయటకు రావడం లేదు’’ చెప్పాను అవకాశాన్ని అంది పుచ్చుకుంటూ. ముసలమ్మగారితో మాట్లాడానన్న ఆనందం నన్ను ఉత్సాహపరిచింది. మనిషి సంఘజీవి. ఎవ్వరితోనూ మాట్లడకుండా, మనసు పంచుకోకుండా ఎక్కువకాలం ఉండలేడు. నాకంటే మరో ప్రపంచం ఉండబట్టి పట్టించుకోలేదు గాని, వంటరి ముసలమ్మలాంటి వాళ్ళకు పొరుగింటివాళ్ళ తోడు అవసరం. నాకు మాత్రం ఆవిడంటే కోపమా ఏమిటీ? ఎప్పుడూ లేనిది ఆవిడ విసుక్కుందని ఆవిడ వైపు చూడడం మానేశాను గాని.ఏది ఏమైనా మండు వేసవి. ఎండల కారణంగా.. శిశిరం తరువాత వచ్చే వసంతంలా.. ముడుచుకున్న మా స్నేహం తిరిగి చిగురించినందుకు సంతోషపడ్డాను. ఇప్పుడు ముసలమ్మగారు ఎప్పుడు కనిపించినా చిన్నగా నవ్వుతోంది ఎప్పటిలానే. బయట ఎండలు మండుతున్నా.. పక్కింటి స్నేహం వెన్నెల్ని కురిపిస్తూనే ఉంది మనసుకి హాయిగా. - పీఎల్ఎన్ మంగారత్నం -
బ్రిటన్ ప్రధాని హత్య కుట్ర భగ్నం
లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ గేట్లను పేల్చేసి ఆ గందరగోళంలో లోపలికి చొరబడి థెరిసా మేను కత్తితో పొడిచి హత్య చేయడానికి ఇస్లాం ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారని బ్రిటన్ కౌంటర్ టెర్రరిజం అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణలపై నైముర్ జకారియా రహ్మాన్(20), మహమ్మద్ ఆకిబ్ ఇమ్రాన్(21) అనే ఇద్దరు యువకులను నవంబర్ 28నే అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచిన ఈ ఇద్దరిపై ఉగ్రవాద అభియోగాలు మోపారు. డిసెంబర్ 20న లండన్‌లోని ఓల్డ్ బెయిలీ కోర్టులో హాజరుపరిచేందుకు వీలుగా వారిని పోలీసు రిమాండ్‌కు పంపారు. -
‘గల్ఫ్ ఆఫ్ ఎడెన్’లో పైరేట్ల దాడి
న్యూఢిల్లీ: నావికా దళ గస్తీ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ శుక్రవారం గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో భారత్‌కు చెందిన సరుకు రవాణా నౌకపై దోపిడీ యత్నాన్ని భగ్నం చేసింది. ఎంవీ జాగ్ అమర్ అనే రవాణా నౌకను సముద్ర దొంగలు తమ అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఐఎన్ఎస్ త్రిశూల్ సకాలంలో స్పందించి వారిని నిలువరించింది. సుమారు 5 గంటలు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు నావికాదళ వర్గాలు వెల్లడించాయి. నౌకలోని 26 మంది భారతీయులు సురక్షితమేనని, సముద్ర దొంగల నుంచి ఒక ఏకే 47, ఒక మేగజీన్, 27 రౌండ్ల మందుగుండు సామగ్రి, తాళ్లు, నిచ్చెనలు, కొక్కేలను స్వాధీనం చేసుకున్నామని చెప్పాయి. 12 మంది పడవలపై వచ్చి దోపిడీకి యత్నం చేసినట్లు వెల్లడించాయి. సోమా లియా, యెమెన్ మధ్య ఎర్ర సముద్రంలోని కీలక జలరవాణా మార్గమైన గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో దోపిడీ వ్యతిరేక ఆపరేషన్లలో భారత నేవీ కొంత కాలంగా చురుగ్గా పాల్గొంటోంది. ఏప్రిల్‌లో సోమాలియా హైజాక్ చేసిన ఓ వర్తక నౌకకు భారత్, చైనా నేవీలు కాపాడిన సంగతి తెలిసిందే. -
నిరుద్యోగ ర్యాలీ భగ్నం
-
ర్యాలీ భగ్నం
- జిల్లాల నుంచి రాజధాని వరకు టీజేఏసీ నేతల అరెస్టులు - మంగళవారం అర్ధరాత్రి దాటాక కోదండరాం ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు - తలుపులు పగులగొట్టి అరెస్టు.. కామాటిపుర స్టేషన్‌కు తరలింపు... ఇందిరాపార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీ బందోబస్తు - ఓయూలో ర్యాలీకి విద్యార్థుల యత్నం.. ఉద్రిక్తత - జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ భగ్నమైంది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం సహా పలువురు నేతలు, విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. జిల్లాల నుంచి రాజధానికి వచ్చే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,220 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీస్ శాఖ తెలిపింది. ఇటు హైదరాబాద్‌లో ఉస్మానియా వర్సిటీ, నిజాం కాలేజీతోపాటు అనేక ప్రాంతాల్లో వివిధ విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరవ్యాప్తంగా 447 మందిని ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచి విడిచిపెట్టారు. నాగోల్‌లో సభ నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చినా.. అందుకు నిరాకరిస్తూ టీజేఏసీ మంగళవారం తన పిటిషన్‌ను వాపస్ తీసుకొని, బుధవారం యథాతథంగా ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. కోదండరాం ఇంటి వద్ద ఉద్రిక్తత తార్నాకలో టీ–జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇంటిని బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు చుట్టుముట్టారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులతో సహా దాదాపు వంద మంది ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులు రావడంతో కిటికీలు తెరిచి కోదండరాం వారితో మాట్లాడారు. బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. ఇంత రాత్రి పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని, ఉదయం 6 గంటలకు వస్తానని కోదండరాం సమాధానం ఇచ్చారు. అయితే కొద్దిసేపటికే కోదండరాం ఇంటి తలుపులు పగులకొట్టిన పోలీసులు లోపలకు ప్రవేశించారు. ఆయనతోపాటు దాదాపు 40 మంది జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మీడియాను కోదండరాం ఇంటి నుంచి దూరంగా పంపేశారు. దీంతో కోదండరాం తన అరెస్టు వివరాలను ఫేస్బుక్ లైవ్ ద్వారా వెల్లడించారు. కోదండరాం, జేఏసీ కన్వీనర్ కె.రఘును కామాటిపుర పోలీసుస్టేషన్‌కు, మిగిలిన నాయకుల్లో కొందరిని కంచన్‌బాగ్, అంబర్‌పేట, గోషామహల్ తదితర పోలీసుస్టేషన్లకు పోలీసులు తరలించారు. సాయంత్రం 7.10 గంటల సమయంలో కోదండరాంను విడుదల చేశారు. పోలీసుల దాడి నేపథ్యంలో ధ్వంసమైన కోదండరాం ఇంటి తలుపుల్ని ఉదయం 6 గంటల ప్రాంతంలో పోలీసులే బాగు చేయించారు. పోలీసు గుప్పిట రాజధాని ర్యాలీ నేపథ్యంలో రాజధానిలోని మూడు కమిషనరేట్లలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్‌లో ఉన్న సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా వివిధ ప్రాంతాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అనేక మంది కదలికల్ని గుర్తించి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఎక్కడివారిని అక్కడే అరెస్ట్ చేశారు. ఇక ర్యాలీ, సభ నిర్వహిస్తామంటూ జేఏసీ ప్రకటించిన రెండు ప్రాంతాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్ చుట్టూ భారీ స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున అదనపు బలగాలను మోహరించారు. ఈ రెండు ప్రాంతాలకూ మధ్యన ఉన్న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మూడు చోట్లా అనేక మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. ర్యాలీగా ఇందిరాపార్కుకు వచ్చిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్ని అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్ట్ చేశారు. ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్, విమలక్క, అడ్వకేట్ జేఏసీ నాయకులు ప్రహ్లాద్, పీడీఎస్‌యూ నాయకులతోపాటు సుమారు 90 మందిని అరెస్ట్ చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జ్యోతి అనే నిరుద్యోగిని సుందరయ్య పార్కు వద్ద హల్చల్ చేసింది. అప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకొనేందుకు యత్నించగా.. ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. జీపులో ఎక్కించి తీసుకువెళ్తుండగా.. చున్నీతో మెడకు గట్టిగా చుట్టి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు వెంటనే అప్రమత్తమైన అమె ప్రయత్నాన్ని నిలువరించారు. సచివాలయం భద్రత కట్టుదిట్టం ర్యాలీ నేపథ్యంలో సచివాలయం చుట్టూ బారికేడ్లు, ముళ్లకంచెలు ముందస్తుగా సిద్ధం చేసుకున్నారు. సచివాలయంలోకి ఎవరు వచ్చినా ఐడీకార్డు ఉంటేనే లోపటికి పంపించారు. ఏ క్షణంలోనైనా ఆందోళనకారులు వచ్చే అవకాశాలున్నాయనే సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కెమెరాలలో పర్యవేక్షిస్తూ ప్రధాన గేటు వద్ద ఉన్న సిబ్బందికి సమాచారం అందించారు. కామాటిపుర ఠాణా వద్ద ఉద్రిక్తత కోదండరాంను తెల్లవారుజామున అరెస్టు చేసిన పోలీసులు ఏ స్టేషన్‌కు తరలించారనేది గోప్యంగా ఉంచారు. మధ్యాహ్నానికి ఆయన కామాటిపుర ఠాణాలో ఉన్న విషయం బయటకు వచ్చింది. దీంతో విపక్షాలకు చెందిన నేతలు, మాజీ ఎంపీలు ఆయన్ను కలవడానికి ప్రయత్నించారు. పోలీసుస్టేషన్ వద్దకు వచ్చిన మాజీ ఎంపీలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, నాయకులు రవీంద్ర నాయక్, విజయరామారావు, యూత్ కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో సాయంత్రం వరకు పలుమార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసు చర్యల్ని నిరసిస్తూ స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కమిషనర్ వద్దకు కోదండరాం సతీమణి తన భర్తను వెంటనే విడుదల చేయాలంటూ కోదండరాం భార్య సుశీల, న్యాయవాది రచన బుధవారం మధ్యాహ్నం పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలవడానికి యత్నించారు. ఆ సమయంలో ఆయన కార్యాలయంలో లేకపోవడంతో సాధ్యం కాలేదు. సుశీల సాయంత్రం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా... అపాయింట్మెంట్ లేని కారణంగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రాజ్‌భవన్ ముందు కాస్సేపు నిరసన తెలిపి వెనుదిరిగారు. బుధవారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు కోదండరామ్ ఇంటికి వెళ్లారు. ‘‘ఆయనొక ప్రొఫెసర్.. తీవ్రవాది కాదు.. నక్సలైటు అంతకన్నా కాదు.. అలాంటి వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడి అరెస్టు చేసి పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పుతారా’’ అని ప్రశ్నించారు. జిల్లాల్లో అరెస్టుల పర్వం పలు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు జేఏసీ నేతలను గృహనిర్భందం చేశారు. కీలక నేతలను ముందుస్తుగా అరెస్ట్ చేసి తరలించారు. పాత జిల్లా ఆదిలాబాద్‌లో 210 మంది, కరీంనగర్లో 325, వరంగల్‌లో 330, ఖమ్మంలో 180, నిజామాబాద్‌లో 235, మెదక్‌లో 220, నల్లగొండలో 276, మహబూబ్‌నగర్‌లో 256, రంగారెడ్డి జిల్లాలో 158 మందిని అరెస్ట్ చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ముందుస్తు చర్యల్లో భాగంగానే..: డీజీపీ అనురాగ్ శర్మ ‘‘హైదరాబాద్‌లో జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ జేఏసీ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదు. హైకోర్టు సూచించిన ప్రాంతంలో కాకుండా మరోచోట నిర్వహించడం కుదరదని జేఏసీకి తెలిపాం. అలా కాకుండా ర్యాలీ నిర్వహించి చేస్తామంటే నిబంధనలు ఒప్పుకోవు. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగానే కోదండరాంతోపాటు మిగతా జేఏసీ నాయకులను అరెస్ట్ చేశాం’’ అరెస్టుపై హక్కుల సంఘంలో పిటిషన్ కోదండరాం అరెస్టుపై హైకోర్టు న్యాయవాది నవీనా రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 27 లోపు నివేదిక సమర్పించాలని మానవ హక్కుల సంఘం నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. -
ఆత్మగౌరవ దీక్ష భగ్నం
-
విద్యార్థుల ఆమరణ దీక్ష భగ్నం
గద్వాల: మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాన్న డిమాండ్‌తో నాలుగు రోజులుగా చేస్తున్న విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్షను బుధవారం వేకువజామున 3 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న ఇమ్మాన్యేలు, గంజిపేట రాజును బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి మంగళవారం అర్థరాత్రి దీక్ష భగ్నానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే క్కడ మీడియా ప్రతినిధులు, భారీ సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు ఉండడంతో ఆరోగ్య పరిస్థితి చూడడానికే వచ్చామని చెప్పి వెనుతిరిగి వెళ్లిపోయారు. దీక్షా శిబిరం నుంచి అందరూ వెళ్లిపోయాక బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు వచ్చి దీక్షను భగ్నం చేశారు, దీక్ష చేస్తున్న ఇద్దరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. ఇమ్మాన్యేలు మంగళవారం సాయంత్రం నుంచి కిడ్నీలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. వీరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. టౌన్ ఎస్ఐ నారాయణసింగ్ పర్యవేక్షణలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. -
ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం
-
ఖాకీల కాఠిన్యానికి అమాయకులు బలి!
ఢిల్లీ ఖాకీల దౌర్జన్యాలకు అమాయకుల జీవితాలు బలైపోతున్నాయి. పోలీసుల అనుమానాలు యువత భవితను అయోమయం చేస్తున్నాయి. జంతుశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, దక్షిణ కొరియాలో పీహెచ్ డీ చేసేందుకు స్కాలర్ షిప్ కూడ పొంది, పూనెలో టోఫెల్ పరీక్ష రాసేందుకు వెడుతున్న పర్వేజ్ అహ్మద్ రాడూ, ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నసమయంలో ... ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేయడం... అతడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. అటువంటి యువత మరెంతోమంది ఖాకీ కాఠిన్యానికి జీవితాలనే కోల్పోతున్నారు. 2006 సెప్టెంబర్ 12... రాడూ జీవితంలో చీకటి రోజు... ఢిల్లీ ద్వారకా హోటల్లోని రహస్య ఛాంబర్ లో నిర్భంధించి, చిత్ర హింసలకు గురి చేసి, సుదీర్ఘ హింస పెట్టి, అనంతరం జైలుపాలు చేసిన రోజది. చివరకు ఏడేళ్ళ జైలు తర్వాత 2013 లో సెషన్స్ కోర్టు అతనిపై ఆరోపణలను కొట్టివేసి నిర్దోషిగా తేల్చింది. కానీ అప్పటికే రాడూ జీవితం నాశనమైపోయింది. ఆ పీహెచ్ డీ డ్రాపవుట్.. ప్రస్తుతం ఓ చిన్న డ్రైఫ్రూట్ హోల్ సేల్ షాప్ నడుపుతూ చాక్లెట్లు, కాండీలు అమ్ముకుంటున్నాడు. ఏడు సంవత్సరాల జైలు శిక్షతో కెరీర్ ను పూర్తిగా కోల్పోయాడు. రాడూ కథలాగే మరో 24 కేసుల్లో . ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్టులు చేయగా... ఆరోపణలు, హింస, ఎదుర్కొని, జైలు శిక్ష అనుభవించి చివరికి ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు నిర్దోషులుగా వారిని విడిచిపెట్టినట్లు జామియా టీచర్స్ సాలిడారిటీ అసోసియేషన్ తయారుచేసిన నివేదిక ద్వారా తెలుస్తోంది. వీరిలో ఏడుగురు కాశ్మీర్ కు చెందిన ముస్లిం యువత ఉన్నారు. ఢిల్లీ ఆర్చ్ స్ట్రీట్ బాంబ్ బ్లాస్ట్ కు కారకులైన జైషే ఇ మొహ్మద్ టీం లోని వ్యక్తిగా అనుమానించి రాడూను అరెస్టు చేసిన పోలీసులు టీం కమాండర్ ఆచూకీ కోసం కాశ్మీర్ లో కూడ గాలింపు చేపట్టారు. రాడూ తండ్రి సోపూర్ డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్ గా చేసి రిటైరయ్యారు. ఆయన అప్పట్లో హోం శాఖకు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు, మైనారిటీ కమిషన్ కు కూడ లేఖలు రాశారు. తమ కుమారుడికి ఎదో ఒకరకమైన ఉపశమనం దొరుకుతుందని ఎంతో వేచి చూశారు. కానీ అప్పట్లో వారికి ఎటువంటి సహాయం అందలేదు. అయితే సెషన్స్ కోర్టు ప్రాసిక్యూషన్ లో రాడూ మిలిటెంట్ అనేందుకు ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో చివరికి నిర్దోషిగా విడిచి పెట్టారు. పర్వేజ్ ఎటువంటి మిలిటెంట్ ఆపరేషన్స్ కోసం ఢిల్లీ రాలేదని 2013 లో తేల్చి చెప్పారు. పోలీసులు తర్వాత హైకోర్టు లో వేసినా జడ్జిమెంట్ డిస్ మిస్ అయింది. అయితేనేం రాడూ కెరీర్ మాత్రం అంధకారంలో ములిగిపోయింది. జైలు నుంచీ వచ్చిన తర్వాత ఆరునెల్లపాటు కాశ్మీర్ లో ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాడు. కానీ అతడి కేసు గురించి తెలిసి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. చివరికి ఓ సంవత్సరం క్రితం రాడూ చిన్న వ్యాపారం ప్రారంభించాల్సి వచ్చింది. ''మా కొడుకు జీవితం ఇలా అయిపోతుందని మేమెప్పుడూ అనుకోలేదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాడూ తల్లిదండ్రులు. ఏది ఏమైనా కొడుకు అమాయకుడు అని తేలిందని, అల్లా న్యాయం చేశాడని సంతోష పడుతున్నారు. ఢిల్లీ పోలీసుల అరాచకానికి ఒక్క రాడూనే కాదు... భారత దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధపడ్డాడంటూ ఆరోపణలతో అరెస్టు చేసి, సంవత్సరాల తరబడి విచారణ కొనసాగి చివరికి నిర్దోషులుగా తేలిన ముష్తాక్ అహ్మద్ వంటి ఎంతోమంది జీవితాలు బలైపోతున్నాయి. ఒక్కోసారి కేసులు ట్రయల్ కోర్టులోనే తేలిపోవడం ఉండదు. సంవత్సరాల తరబడి విచారణ కొనసాగుతూనే ఉంటాయి. అయితే చివరికి వారిని నిర్దోషులుగా తేల్చినా ఉపయోగం ఉండదు. జామియా టీచర్స్ సోలిడారిటీ అసోసియేషన్ ఇచ్చిన 24 కేసుల నివేదిక ఆధారంగా చూస్తే సుమారు అన్ని కేసుల్లోనూ అదే పోలీసుల పేర్లు రిపీట్ అవడం గమనించాల్సిన విషయం. వారి కార్య నిర్వాహణ పద్ధతి హింసాత్మకంగా ఉండటంవల్లే ఇటువంటి కేసులు పునరావృతం అవుతున్నాయని, ఎంతోమంది అమాయకుల జీవితాలు బలైపోతున్నాయని అంటున్నారు. మరణించిన వారిగురించి చెడుగా మాట్లాడకూడదని తెలుసు.. కానీ ఇనస్పెక్టర్ బద్రీష్ దత్ గురించి మాట్లాడాల్సి వస్తోందంటే అతడు మా అందరికీ ఎంతో అన్యాయం చేశాడు. అతడి హింసాత్మక ప్రవర్తన ఎంతో మంది జీవితాలను అంధకారం చేసింది.అలాగే మరెంతోమంది పోలీసు అధికారులు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నాడు రాడూ. ఇప్పటికైనా ఢిలీ పోలీసుల అరాచకత్వానికి యువత బలికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఉద్యమంపై ఉక్కుపాదం
కలెక్టరేట్ (కాకినాడ), న్యూస్‌లైన్ :కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ నాయకులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శనివారం ఉదయం భగ్నం చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించా లన్న ప్రధాన డిమాండ్లతో.. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వీరలక్ష్మితో పాటు 25 మంది ఐదు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అధిక సంఖ్యలో మోహరించిన పోలీసులు దీక్ష చేస్తున్న వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు శనివారం ఉదయం ప్రయత్నించారు. వారిని అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిఘటించేందుకు విఫల యత్నం చేశారు. దీక్ష చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. దీక్షలు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరం నుంచి జెడ్పీ సెంటర్, జీజీహెచ్, శాంతిభవన్ మీదు గా బాలాజీచెరువు సెంటర్ వరకూ ర్యాలీ చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సర్కిల్ వద్ద గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17 నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెకు జిల్లాలోని 25 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.