
న్యూఢిల్లీ: నావికా దళ గస్తీ నౌక ఐఎన్‌ఎస్ త్రిశూల్ శుక్రవారం గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో భారత్‌కు చెందిన సరుకు రవాణా నౌకపై దోపిడీ యత్నాన్ని భగ్నం చేసింది. ఎంవీ జాగ్ అమర్ అనే రవాణా నౌకను సముద్ర దొంగలు తమ అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఐఎన్‌ఎస్ త్రిశూల్ సకాలంలో స్పందించి వారిని నిలువరించింది. సుమారు 5 గంటలు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు నావికాదళ వర్గాలు వెల్లడించాయి.
నౌకలోని 26 మంది భారతీయులు సురక్షితమేనని, సముద్ర దొంగల నుంచి ఒక ఏకే 47, ఒక మేగజీన్, 27 రౌండ్ల మందుగుండు సామగ్రి, తాళ్లు, నిచ్చెనలు, కొక్కేలను స్వాధీనం చేసుకున్నామని చెప్పాయి. 12 మంది పడవలపై వచ్చి దోపిడీకి యత్నం చేసినట్లు వెల్లడించాయి. సోమా లియా, యెమెన్ మధ్య ఎర్ర సముద్రంలోని కీలక జలరవాణా మార్గమైన గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో దోపిడీ వ్యతిరేక ఆపరేషన్లలో భారత నేవీ కొంత కాలంగా చురుగ్గా పాల్గొంటోంది. ఏప్రిల్‌లో సోమాలియా హైజాక్ చేసిన ఓ వర్తక నౌకకు భారత్, చైనా నేవీలు కాపాడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment