లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ గేట్లను పేల్చేసి ఆ గందరగోళంలో లోపలికి చొరబడి థెరిసా మేను కత్తితో పొడిచి హత్య చేయడానికి ఇస్లాం ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారని బ్రిటన్ కౌంటర్ టెర్రరిజం అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణలపై నైముర్ జకారియా రహ్మాన్(20), మహమ్మద్ ఆకిబ్ ఇమ్రాన్(21) అనే ఇద్దరు యువకులను నవంబర్ 28నే అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచిన ఈ ఇద్దరిపై ఉగ్రవాద అభియోగాలు మోపారు. డిసెంబర్ 20న లండన్‌లోని ఓల్డ్ బెయిలీ కోర్టులో హాజరుపరిచేందుకు వీలుగా వారిని పోలీసు రిమాండ్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment