
లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా సోమవారం లండన్ చేరుకున్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో బ్రిటన్ రాణి ఎలిజబెత్–2ను ఆయన సతీసమేతంగా కలుసుకున్నారు.అనంతరం ప్రిన్స్ చార్లెస్‌ను కూడా ట్రంప్ కలిశారు. త్వరలో పదవి నుంచి దిగిపోబోతున్న బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యి, చైనా సంస్థ హువావే వివాదం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా, తన పాత శత్రువు, లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ట్రంప్ లండన్‌లో దిగగానే ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.