విద్యార్థుల ఆమరణ దీక్ష భగ్నం
గద్వాల: మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాన్న డిమాండ్‌తో నాలుగు రోజులుగా చేస్తున్న విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్షను బుధవారం వేకువజామున 3 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న ఇమ్మాన్యేలు, గంజిపేట రాజును బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి మంగళవారం అర్థరాత్రి దీక్ష భగ్నానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే క్కడ మీడియా ప్రతినిధులు, భారీ సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు ఉండడంతో ఆరోగ్య పరిస్థితి చూడడానికే వచ్చామని చెప్పి వెనుతిరిగి వెళ్లిపోయారు.
దీక్షా శిబిరం నుంచి అందరూ వెళ్లిపోయాక బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు వచ్చి దీక్షను భగ్నం చేశారు, దీక్ష చేస్తున్న ఇద్దరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. ఇమ్మాన్యేలు మంగళవారం సాయంత్రం నుంచి కిడ్నీలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. వీరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. టౌన్ ఎస్‌ఐ నారాయణసింగ్ పర్యవేక్షణలో వైద్యులు చికిత్స చేస్తున్నారు.