ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) :
ఇంద్రకీలాద్రికి కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు యాత్రికులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి యాత్రికులు బారులు తీరారు. ఆదివారం సుమారు 2.20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. ఇక భవానీపురం వైపు నుంచి వచ్చే యాత్రికులను ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి అనుమతించి ఓం టర్నింగ్ వద్ద క్యూలైన్‌లో కలిపారు.
అమ్మవారికి దర్శించుకున్న మంత్రి, ఎంపీ
దుర్గమ్మను కార్మికశాఖ మంత్రి కె.అచ్చన్నాయుడు దంపతులు, శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో సూర్యకుమారి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానానికి రూ. 26.05 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.