అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీపీ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ శుక్రవారం దుర్గమ్మకు పట్టుచీర సమర్పించారు. తొలుత వన్‌టౌన్ పీఎస్‌కు చేరుకున్న సీపీ స్టేషన్‌లో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, తీన్‌మాన్ డప్పుల వాయిద్యాల నడుమ పట్టుచీరను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అమ్మవారికి పట్టుచీరను సమర్పించేందుకు విచ్చేసిన సీపీకి ఆలయ ఈవో సూర్యకుమారి సాదరంగా స్వాగతం పలికారు. చీరను సమర్పించి ఉత్సవాలు విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు కుటుంబసమేతంగా పాల్గొన్నారు.