కాంస్య పతకంతో మెరిసిన ప్రియాంక | National senior Chess Championship 2022: Priyanka Nutakki Wins Bronze Medal | Sakshi
Sakshi News home page

National senior Chess Championship 2022: కాంస్య పతకంతో మెరిసిన ప్రియాంక

Published Thu, Mar 3 2022 8:05 AM | Last Updated on Thu, Mar 3 2022 8:06 AM

National senior Chess Championship 2022: Priyanka Nutakki Wins Bronze Medal - Sakshi

భువనేశ్వర్‌: జాతీయ సీనియర్‌ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి నూతక్కి ప్రియాంక కాంస్య పతకంతో మెరిసింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 19 ఏళ్ల ప్రియాంక ఏడు పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్‌ముఖ్‌ 8 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. 103 మంది క్రీడాకారిణులు తొమ్మిది రౌండ్లపాటు పోటీపడిన ఈ టోర్నీ లో ప్రియాంక ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయింది. 

చదవండి: ITF Tournament: ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యూష 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement