
ఫైల్ ఫోటో
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో డివిజన్‌ల వారీగా నిర్దేశించిన కొన్ని రైళ్లలో సాధారణ టికెట్ (రిజర్వేషన్ లేకుండా) ఉన్న ప్రయాణికులకు ప్రయాణ అవకాశం కల్పిస్తూ దక్షణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సాధారణ టికెట్‌లను అందుబాటులో ఉన్న రైల్వే బుకింగ్ కౌంటర్‌ల వద్ద కానీ, యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
చదవండి: కర్రకు ప్రాణం.. కళకు రూపం
విజయవాడ డివిజన్ పరిధిలో ఈ నెల 24 నుంచి గూడూరు–సికింద్రాబాద్ (02709), గూడురు–విజయవాడ (02743/02744), విజయవాడ–సికింద్రాబాద్ (02799), నర్సాపూర్–ధర్మవరం (07247), కాకినాడ టౌన్–రేణిగుంట (07249), నర్సాపూర్–లింగంపల్లి (07255), ఈ నెల 25 నుంచి మచిలీపట్నం–బీదర్ (02749), విజయవాడ–లింగంపల్లి (02795), ఈ నెల 27 నుంచి కాకినాడ పోర్టు–లింగంపల్లి (02737), నర్సాపూర్–నాగర్‌సోల్ (07231 ), ఈ నెల 28 నుంచి నర్సాపూర్–నాగర్‌సోల్ (02713) రైళ్లలో రిజర్వేషన్ లేకుండానే ప్రయాణానికి అవకాశం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment