
విజయవాడ: అసెంబ్లీలో ముఖ్యమత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి మందకృష్ణ మాదిగ.. చంద్రబాబు డైరెక‌్షన్‌లో నడుస్తున్నారని ‘మాదిగ మహాసేన’ రాష్ట్ర అధ్యక్షుడు కొరిపాటి ప్రేమ్ కుమార్ విమర్శించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా వర్గీకరణ పోరాటంలో మాదిగల అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్‌ని గెలిపించుకున్న మాదిగల మధ్యనే గొడవలు పెడుతున్నారని మండిపడ్డారు.
అదేవిధంగా గతంలో చంద్రబాబు వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. నోటాకి ఓటు వేయమన్న వ్యక్తి మంద కృష్ణ మాదిగ.. ఏ మొహం పెట్టకొని అడుగుతున్నావని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలు అంతా జగన్‌తోనే ఉన్నారని తెలిపారు. కాగా మందకృష్ణను నమ్మే పరిస్థితిలో ఎవరు లేవరని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ నెల 30న మందకృష్ణ మాదిగ చేపట్టిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకుంటామని తెలిపారు.