అన్నదమ్ముల్లా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టే యత్నం
ఎన్నికలు వచ్చాయంటే మంద కృష్ణకు పండగే!
మంద కృష్ణపై దళితుల మండిపాటు
సాక్షి, అమరావతి/భీమవరం/తాడేపల్లిరూరల్/నెహ్రూనగర్/కడప కార్పొరేషన్: ఎన్నికలు వచ్చాయంటే చాలు అన్నదమ్ముల్లా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేలా చంద్రబాబు కుట్రలు చేస్తారని మాల మహానాడు(పీవీ రావు) జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు మండిపడ్డారు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు మంద కృష్ణ మాదిగతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తారని తెలిపారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగల ఆత్మగౌరవాన్ని కొన్నేళ్లపాటు మంద కృష్ణ చంద్రబాబు పాదాల వద్ద పెట్టారని చెప్పారు.
మళ్లీ ఈ మధ్య ప్రధాని మోదీ పాదాల చెంతపెట్టారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చాయంటే మంద కృష్ణ మాదిగకు పండుగేనని, చంద్రబాబు రాజకీయాల్లో ప్యాకేజీ అనేది మొదట మంద కృష్ణతోనే ప్రారంభించారని తెలిపారు. ఏపీ రాజకీయాలతో మంద కృష్ణకు ఏం పనని, ఇన్నేళ్ల పాటు ఎమ్మార్పీఎస్ పేరుతో మంద కృష్ణ వెలగబెట్టిన రాజకీయాలు తెలియని వారు ఎవరూ లేరన్నారు. 30న మంద కృష్ణమాదిగ నిర్వహించాలని చూస్తోంది.. మాదిగల సదస్సు కాదనీ, అది టీడీపీ మాయ సభ అని చెప్పారు.
‘దళితులను హేళనచేసిన బాబుకు మద్దతా’
దళితులకు చంద్రబాబు బద్ధ శత్రువని, మంద కృష్ణమాదిగకు డబ్బులిచ్చి మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు దుయ్యబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడారు. మంద కృష్ణమాదిగ పెద్ద మొత్తంలో ప్యాకేజీ తీసుకుని మాదిగ సోదరులను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు.
ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ దళితులను హేళన చేసిన చంద్రబాబుకు మద్దతివ్వడం దారుణమన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చి నందిగం సురేష్కు బాపట్ల ఎంపీగా సీటు ఇవ్వడంతో పాటు హోం మంత్రిగా తానేటి వనిత, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆదిమూలం సురేష్లకు ఉన్నత పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. తెలంగాణకు చెందిన మంద కృష్ణకు ఏపీతో సంబంధమేంటని ప్రశ్నించారు.
‘సదస్సును అడ్డుకుని తీరతాం’
మంద కృష్ణ ఈ నెల 30న నిర్వహించే సదస్సును అడ్డుకుని తీరతామని నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు హెచ్చరించారు. అసలు ఏపీలో మాదిగ సదస్సు పెట్టడానికి నీకు ఏ అర్హత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ కృష్ణమాదిగ నిర్వహించాలనుకున్నది మాదిగల సభ కాదని టీడీపీ ప్రాయోజిత సదస్సుగా అభివర్ణించారు.
మాదిగలను ప్రతిసారీ నమ్మించి చంద్రబాబుకు తెగనమ్మడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. కనీసం బడిలోకి కూడా రానీయకుండా దళితులను దశాబ్దాల తరబడి చదువులకు దూరం చేశారో.. అలాంటి విద్యాశాఖకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్ను మంత్రిగా చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం ద్వారా తరతరాల దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడారని, సంక్షేమ పథకాలతో వారి బతుకుల్లో వెలుగులు నింపిన వైఎస్ జగన్‌ను అణగారిన వర్గాల ఆత్మ బంధువుగా అభివర్ణించారు.
‘మాదిగలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్న మందకృష్ణ’
మంద కృష్ణమాదిగ మాదిగలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు అన్నారు. తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. కృష్ణమాదిగ తన వ్యక్తిగత స్వార్థం కోసం మాదిగలను చంద్రబాబుకు తాకట్టు పెట్టాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్.. 2019 ఎన్నికల్లో ఎంపీ సీటును నందిగం సురేష్కు కేటాయిస్తే కనీసం మద్దతు కూడా ఇవ్వలేదని, ఓ మాదిగను పార్లమెంట్‌కు పంపిస్తుంటే మద్దతివ్వలేదంటే మంద కృష్ణ స్వార్థాన్ని అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబు తప్ప మందకృష్ణ మాదిగను ఏ రాజకీయ పార్టీ నమ్మదన్నారు.
మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మంద కృష్ణమాదిగ 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబును ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. సీట్ల కోసం కాకుండా కాసుల కోసమే వర్గీకరణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని తన ప్రయోజనాలు కాపాడుకుంటున్నారని మండిపడ్డారు. వర్గీకరణ అంశం కేంద్రం చేతిలో ఉందని, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని, ఎన్నికల అనంతరం మాదిగలను పోలీసులతో కొట్టించిన ఘనత చంద్రబాబుదని అలాంటి వ్యక్తికి మందకృష్ణ మాదిగలను తాకట్టు పెట్టడం దారుణమన్నారు. సీఎం వైఎస్ జగన్ వచ్చాకే మాదిగల జీవితాల్లో మార్పు వచి్చందన్నారు.
‘మాదిగలంతా సీఎం జగన్ వెంటే’
రాష్ట్రంలో మాదిగలంతా జగనన్నకు తోడుగా, నీడగా ఉంటారని నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి గరుడాద్రి అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాదిగలు, మాదిగ ఉప కులాలను గంపగుత్తగా ఒక పార్టీకి తాకట్టు పెట్టే అధికారం మంద కృష్ణకు ఎక్కడిదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేయాలని చెప్పడానికి ఆయనెవరని నిలదీశారు. మంద కృష్ణమాదిగకు మాదిగ జాతి ఇంకా గులాంగిరి చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. సీఎం జగనన్న ప్రభుత్వం దళితులకు, అణగారిన ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటోందని, మాదిగలు ఈ విషయాలన్ని గుర్తించి సీఎం జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment