
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వర్షపు నీరు చేరడంతో వన్ టౌన్ ప్రాంతంలో నీరు రోడ్లపైకి చేరింది. దీంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఈ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.