
నేడు జిల్లాకు జగన్ రాక
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తున్
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హనుమాన్‌జంక్షన్, ఏలూరు మీదుగా నర్సాపురం చేరుకుంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.