
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై విమర్శలు చేసే అర్హత లేదని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజీ అన్నారు. ఆయన బుధవారం మీడియాలో మాట్లాడుతూ.. బ్యాంక్‌లకు రుణాలు ఎగ్గొట్టిన నాని.. మోదీ, ఆమిత్ షాపై విమర్శలు చేసే అర్హత లేదని షేక్ బాజీ ఎద్దేవా చేశారు. కేశినేని ట్రావెల్స్ పేరుతో కార్మికుల జీతాలు ఎగ్గొట్టి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఆయన మండిపడ్డారు. నష్టాలను సాకుగా చూపించి కార్మికుల పొట్టగొట్టావని మండిపడ్డారు. సీఏఏకు టీడీపీ ద్వంద విధానంతో ఉందన్నారు. చంద్రబాబు సీఏఏకు మద్దతు తెలుపుతారు.. రాష్ట్రంలో వ్యతిరేకంగా తమ నాయకులతో బీజేపీపై ఉద్యమాలు చేయిస్తారని షేక్ బాజీ దుయ్యబట్టారు. ‘చంద్రబాబు ప్రతిపక్షనేత కాదు.. పనికిమాలిన నేత’
Comments
Please login to add a commentAdd a comment