
సాక్షి, హైదరాబాద్ : మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులో రాయపాటికి చెందిన నివాసాల్లో, ఆఫీసుల్లో ఉదయం నుంచి ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ రూ. 300కోట్ల మేర బ్యాంకు రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై కేసు నమోదు చేసిన అధికారులు అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది.
Comments
Please login to add a commentAdd a comment