సాక్షి, హైదరాబాద్: ప్రజా భవన్ బాంబ్ బెదిరింపు కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటలోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడిని గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు.
కాగా మంగళవారం ఉదయం ప్రజాభవన్‌లో, నాంపల్లి కోర్టులో బాంబ్ పెట్టినట్లు కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేసిన రామకృష్ణ.. అధికారును కంగారు పెట్టించాడు. అయితే రామకృష్ణ భార్యతో గొడవ పడి మధ్యనికి బానిసగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య దూరం అవ్వడంతో ఆమె లేదని బాధలో ఫోన్ చేసినట్లు పోలీసులు తేల్చారు.
అసలేం జరిగిందంటే..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్ లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసిపి మనోహర్ కుమార్ సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు మూడు గంటలపాటు తనిఖీలు సాగాయి. అనంతరం ఫేక్ కాల్‌గా తేలడంతో ప్రజాభవన్ నుంచిబాంబ్ స్క్వాడ్ ,డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. ప్రజాభవన్ నుంచి బయటకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment