whipped
-
కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే?
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బఘేల్ తన చేతి మణికట్టుపై కొరడాతో కొట్టించుకున్నారు. ఆయన దుర్గ్ జిల్లాలోని జజంగిరి, కుమ్హారి అనే రెండు గ్రామాలలో జానపద సంప్రదాయంలో భాగంగా ఆయన ఇలా కొరడాతో కొట్టించుకున్నారు. గౌరి పూజ సమయంలో ఇలా కొరడాతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతారు. ఎలాంటి చెడు జరగకుండా అమ్మ కాపాడుతుందని విశ్వసిస్తారు. భూపేశ్ బఘేల్ రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన కార్యాలయం పేర్కొంది. అందుకు సబంధించిన వీడియోని చత్తీస్‌గఢ్ సీఎం ట్వీట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. सोंटे का प्रहार और परंपराओं का निर्वहन. pic.twitter.com/SV82qommmu — Bhupesh Baghel (@bhupeshbaghel) October 25, 2022 (చదవండి: కలిచివేసే ఘటన: చావుబతుకుల మధ్య ఉంటే చుట్టూ చేరి ఫోటోలు తీస్తూ...) -
వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ..
స్మార్ట్ ఫోన్లు వచ్చేశాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. ఇలాంటి ఈ కంప్యూటర్ యుగంలో ఇంకా చాలామంది మూడనమ్మకాలను విశ్వసిస్తున్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఈ మూఢనమ్మకాల పేరిట చేస్తున్న హింసాత్మక ఆచారాలను కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికి పాటిస్తున్నారు. అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటంటే చదువుకున్న కొంతమంది కూడా వాటిని నమ్ముతుండటం కాస్త విస్మయానికి గురి చేస్తుంది. అచ్చం అలానే ఇక్కడొకప్రాంతంలో ఆచారం పేరిట మహిళలను కొరడాతో హింసిస్తుంటారు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని ఒక పూజారి ‘కాటేరి’(చెడును దూరంగా ఉంచమని ప్రార్థించే దేవత)లా నల్లని దుస్తులను ధరించి మహిళలపై కొరడాతో కొడుతుంటాడు. ఆ పూజారి దృష్టిలో వాళ్లంతా చేతబడికి గురయ్యారని అర్థం. ఇతను అలా కొరడాతో కొడుతుంటే చుట్టు ఉన్న చుట్టు ఉన్న ప్రజలు ఈలలు వేస్తూ, అరుస్తే ఉత్సాహపరుస్తుంటారు. సదరు మహిళ ఆ పూజారికి చేతులెత్తి నమస్కరిస్తుంటే పూజారి దుష్టగాలి సోకకుండా ఉండేదు కోసం వారిని కొరడాతో కొడుతుంటాడు. తాజా ఘటన నమక్కల్ జిల్లా వర్దరాజపెరుమాళ్ చెల్లియమ్మన్ మారియమ్మన్ ఆలయంలో చోటుచేసుకోవడంతో..అది వైరల్ అయ్యింది. ఐతే పూజారి ఇలా చేస్తే తమకెంతో మేలు జరుగుతుందని ప్రజలు చెబుతుండటం విశేషం. వాస్తవానికి రెండు వర్గాల మధ్య గొడవ కారణంగా గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరగలేదు. మళ్లీ ఇప్పుడే ఈ ఆలయంలో తొలిసారిగా ఈ వింత ఆచారానికి సంబంధించిన ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలను నెల రోజులు పాటు నిర్వహిస్తారు. (చదవండి: పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఇజ్జత్ మొత్తం పోయింది) -
కొరడా దెబ్బలు తిన్న సీఎం.. ఎందుకో తెలుసా?
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా గోవర్థన పూజ సందర్భంగా కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. ఇందులో భాగం గానే రాష్ట్ర సీఎం కూడా కొరడా దెబ్బలు తిని అక్కడి ఆలయ సంప్రదాయాన్ని పాటించారు. ఈ వీడియోను భూపేష్ స్వయంగా ట్విటర్లో షేర్ చేశారు. ఒక వ్యక్తి సీఎం చేతులపై కొరడాతో కొట్టడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. శుక్రవారం రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలోని ఒక గ్రామంలో గోవర్ధన్ పూజ పండుగ వేడుకలకు హాజరైన సీఎం సంప్రదాయం ప్రకారం 'సొంట' (గడ్డితో చేసిన కొరడా)తో కొరడాతో కొట్టించుకుని ఆ బాధను భరించడం విశేషం. ప్రజల సంక్షేమం కోసం ఇలా చేశానని, తద్వారా సకల శుభాలు కలుగుతాయని ఆయన చెప్పారు. గోవు ఎంత సుభిక్షంగా ఉంటే ప్రజలు అంత అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో గోవర్ధన్ పూజకు ఆదరణ ఉంటుందని సీఎం చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి ఏటా గోవర్ధన్ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పూజలో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. అందులో భాగంగా కొంతమంది కొరడాతో దెబ్బలు కొడుతుంటారు. ఇలా కొరడా దెబ్బలు తింటే తమ అభివృద్ధికి అడ్డంకులన్నీ తొలగిపోతాయని రాష్ట్ర ప్రజల నమ్మకం. ఈ క్రమంలోనే సీఎం భూపేష్ బఘేల్ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. గ్రామ పెద్ద భరోసా ఠాకూర్ జంజ్గిరిలో ఈ సంప్రదాయాన్ని నిర్వహించి, ప్రజలను వారి కోరిక మేరకు కొరడాతో కొట్టేవారనీ, అతని మరణం తరువాత, అతని కుమారుడు బీరేంద్ర ఠాకూర్ అతని వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నాడని అధికారులు తెలిపారు. प्रदेश की मंगल कामना और शुभ हेतु आज जंजगिरी में सोटा प्रहार सहने की परंपरा निभाई। सभी विघ्नों का नाश हो। pic.twitter.com/bHQNFIFzGv — Bhupesh Baghel (@bhupeshbaghel) November 5, 2021 -
స్వలింగ సంపర్కం : ఇద్దరు మహిళలకు శిక్ష
కౌలలంపూర్ : స్వలింగ సంపర్కం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముస్లిం మహిళలను మలేషియాలోని ఓ కోర్టు దోషులుగా తేల్చింది. ఒక్కొక్కరికి ఆరు కొరడా దెబ్బలు, 56 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టు ఆవరణలోనే వారిని కొరడాతో దండించారు. ఈ ఘటన తెరంగను రాష్ర్టంలో మంగళవారం చోటుచేసుకుంది. 32, 22 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు గత ఏప్రిల్‌లో స్వలింగ సంపర్కానికి ఒడిగట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముహమద్ ఖాస్మీజాన్ అబ్దుల్లా మీడియాకు వెల్లడించారు. షరియా చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం నేరమని తెలిపారు. స్వలింగ సంపర్కానికి సంబంధించి తెరంగను రాష్ర్టంలో ఇదే తొలి తీర్పు అని తెలిపారు. కాగా, ఈ తీర్పుపై మలేషియాలోని ఎల్జీబీటీ కమ్యూనిటీ నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇలాంటివి గతంలో చోటుచేసుకున్నా ఎవర్నీ దోషులుగా తేల్చలేదని తిలగా సులాతిరే అనే హక్కుల కార్యకర్త కోర్టు తీర్పుపై మండిపడుతున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం ఎల్జీబీటీ కమ్యూనిటీపై వివక్ష చూపుతున్నారడానికి నిదర్శనమని విమర్శించారు. -
పెట్రోల్ బంకులో దాష్టీకం.. వైరల్
పెట్రోల్ బంకులో పని చేసే వ్యక్తిపై బంకు యాజమాని దాష్టీకానికి పాల్పడ్డాడు. కట్టేసి మరీ అతన్ని దారుణంగా హింసించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుండగా.. అధికారులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నిరోజులుగా పనులోకి రావట్లేదన్న కోపంతో సదరు వ్యక్తిని బంక్‌లోని పిల్లర్‌కు కట్టేసి ఆ యాజమాని కొరడాతో చితకబాదాడు. అంతేకాదు అక్కడే ఉన్న మరోవ్యక్తితో కూడా అతను కొట్టించాడు. ఎంత బతిమిలాడుకున్న అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడికొచ్చిన ఓ వాహనదారుడు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా, వైరల్ కావటంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ‘నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. అందుకే వారం నుంచి పనిలోకి రావట్లేదు. ఆ కోపంతోనే బంక్ ఓనర్, అతని స్నేహితుడు నాపై దాడి చేశారు’ అని బాధితుడు చెబుతున్నాడు. -
పెట్రోల్ బంకు యాజమాని దాష్టీకం..
-
దుస్తులు విప్పించి కొడుతున్నాడు.. కాపాడండి
న్యూఢిల్లీ: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న భారతీయులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. యజమానుల చేతిలో చిత్రహింసలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు ఒకటి వెలుగుచూసింది. ఉపాధి కోసం ఖతర్‌కు వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులను దారుణంగా హింసించారు. పైఅధికారి ఒకరు వీళ్ల లోదుస్తులు విప్పించి, గుర్రం పగ్గం తీసుకుని రక్తం వచ్చేలా విచక్షణరహితంగా కొట్టాడు. వాళ్ల చేతులు, కాళ్లు, తొడలు, వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తమకు తగిలిన గాయాలను వీడియో తీసి పంపారు. తాము ఆపదలో ఉన్నామని ఆదుకోవాల్సిందిగా విన్నవించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పర్వేజ్ అహ్మద్ (24), మహ్మద్ అక్రమ్ (27) నాలుగు నెలల క్రితం పుణెకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా ఖతర్ వెళ్లారు. పర్వేజ్ ఐదేళ్ల కాలపరిమితిపై డ్రైవర్‌గా పనిచేసేందుకు వర్క్ వీసాపై వెళ్లాడు. కాగా వీరిద్దరినీ సౌదీ అరేబియా-ఖతర్ సరిహద్దున ఉన్న ఓ ఫామ్‌కు తీసుకెళ్లి మేకలు, ఒంటెల సంరక్షణ బాధ్యత అప్పగించారు. అక్కడ పనిచేస్తున్న ఓ అధికారి తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పర్వేజ్ వీడియోలో తెలిపాడు. ఇక్కడ నరకం అనుభవిస్తున్నామని, ఇక్కడ పనిచేయడం కంటే జైల్లో ఉండటం మేలని వాపోయాడు. పర్వేజ్ ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడు అఫ్తామ్ ఆలంకు ఈ విషయాలు తెలిపాడు. గాయాలతో ఉన్న పర్వేజ్, అక్రమ్ ఫొటోలను ఆలంకు పంపాడు. తాము సాయం కోరామని తెలిస్తే ఆ అధికారి తమను వేరే ప్రాంతానికి పంపించే అవకాశముందని, తమను తప్పుడు కేసులో ఇరికించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమను కాపాడాలని పర్వేజ్ విన్నవించాడు.