Man Whipped in Madhya Pradesh Petrol Pump for not Coming to Work - Sakshi
Sakshi News home page

Published Fri, Jul 6 2018 9:05 AM | Last Updated on Mon, Oct 8 2018 3:19 PM

Petrol Bun Owner Thrash Employee in Madhya Pradesh - Sakshi

పెట్రోల్‌ బంకులో పని చేసే వ్యక్తిపై బంకు యాజమాని దాష్టీకానికి పాల్పడ్డాడు. కట్టేసి మరీ అతన్ని దారుణంగా హింసించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతుండగా.. అధికారులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్‌ చేశారు. 

భోపాల్‌:  మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నిరోజులుగా పనులోకి రావట్లేదన్న కోపంతో సదరు వ్యక్తిని బంక్‌లోని పిల్లర్‌కు కట్టేసి ఆ యాజమాని కొరడాతో చితకబాదాడు. అంతేకాదు అక్కడే ఉన్న మరోవ్యక్తితో కూడా అతను కొట్టించాడు. ఎంత బతిమిలాడుకున్న అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడికొచ్చిన ఓ వాహనదారుడు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా, వైరల్‌ కావటంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేశారు. ‘నాకు చిన్న యాక్సిడెంట్‌ అయ్యింది. అందుకే వారం నుంచి పనిలోకి రావట్లేదు. ఆ కోపంతోనే బంక్‌ ఓనర్‌, అతని స్నేహితుడు నాపై దాడి చేశారు’ అని బాధితుడు చెబుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement