వాషింగ్టన్: కరోనా కారణంగా ప్రపంచం మాం ద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలీనా జార్జియేవా స్పష్టం చేశారు. 2009 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకున్నాయన్నది సుస్పష్టం. ఆర్థిక కార్యకలాపాలు ఒక్కసారిగా నిల్చిపోవడంతో వర్ధమాన మార్కెట్ల ఆర్థిక అవసరాలకు 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయని ఐఎంఎఫ్ అంచనా. ఇది కనీస స్థాయి మాత్రమే. ఇంతకు మించే అవసరం ఉండవచ్చు‘ అని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment