మేం వెరీ లక్కీ: ముఖ్యమంత్రి | Lucky To Get Her, Says Kerala Chief Minister About Harvard's Gita Gopinath | Sakshi
Sakshi News home page

మేం వెరీ లక్కీ: ముఖ్యమంత్రి

Published Tue, Jul 26 2016 10:11 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

మేం వెరీ లక్కీ: ముఖ్యమంత్రి

మేం వెరీ లక్కీ: ముఖ్యమంత్రి

తిరువనంతపురం: హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. కేరళ మూలాలున్న ఆమె సేవలను రాష్ట్రం కోసం అందిపుచ్చుకోవడం తమకు ఆనందంగా ఉందని, ఈ విషయంలో కేరళ ప్రజలు చాలా అదృష్టవంతులని సీఎం విజయన్ ప్రశంసల జల్లు కురిపించారు.

అయితే, ప్రముఖ ప్రపంచ ఆర్ధికవేత్తగా పేరొందిన గీతా గోపీనాథ్‌ను కేరళ ఆర్థిక సలహాదారుగా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార సీపీఎం సైద్ధాంతిక భావజాలానికి విరుద్ధంగా ఈ నియామకం ఉందని విమర్శకులు అంటున్నారు. 38 ఏళ్ల గీత నూతన ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రబోధిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉదారవాద ఆర్థిక విధానాలకు కాలం చెల్లిందని, ఈ నేపథ్యంలో ఆమె తన వైఖరిలో ఏమేరకు మార్పు తెచ్చుకున్నారో తెలియదని సొంత పార్టీ సీపీఎం నేతలు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement