Chief Minister Pinarayi Vijayan
-
Narendra Modi: అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
వయనాడ్: భీకర వరదలతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల ధాటికి కొట్టుకుపోయిన గ్రామాలు, దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రహదారులు, శిథిలమైన ఇళ్లను పరిశీలించారు. సహాయక శిబిరంలో బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల ఆవేదన విని చలించిపోయారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ తదితరులు ఉన్నారు. బురద దారుల్లో మోదీ నడక ప్రధాని మోదీ తొలుత ఢిల్లీ నుంచి కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వయనాడ్ జిల్లాలోని చూరమల, ముండక్కై, పుంచిరిమట్టామ్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత కాల్పెట్టాలో దిగారు. రోడ్డు మార్గంలో చూరమలకు చేరుకున్నారు. బురద, రాళ్లతో నిండిపోయిన దారుల్లో కాలినడకన కలియదిరిగారు. వరద బీభత్సాన్ని స్వయంగా అంచనా వేశారు. ప్రభుత్వ అధికారులతో, సహాయక సిబ్బందితో మాట్లాడారు. సహాయక చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి మెప్పడిలో సహాయక శిబిరానికి చేరుకొని, బాధితులతో సంభాíÙంచారు. వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. స ర్వం కోల్పోయామంటూ బోరుమని విలపించారు. ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. భుజాలపై చేతులు వేసి మాట్లాడారు. గూడు లేని తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధి తు లు కోరగా, తప్పకుండా ఇస్తామంటూ మోదీ చెప్పారు. పలువురు చిన్నారులతోనూ ఆయ న సంభాíÙంచారు. వరదల తర్వాత భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనపై కాసేపు నడిచారు. మోదీ పర్యటన సందర్భంగా చూరమలలో రహదారికి ఇరువైపులా వందలాది మంది జనం గుమికూడారు. ప్రధానమంత్రి నుంచి సహాయం అరి్థంచడానికి వచ్చామని వారు చెప్పారు. -
షాకింగ్ ఘటన.. 5 ఏళ్లుగా మహిళ పొట్టలోనే కత్తెర..!
తిరువనంతపురం: ఆపరేషన్ చేస్తూ పొట్టలోనే కత్తెర, బ్లెడ్ వంటివి వదిలేసే సంఘటనలు సినిమాల్లో చూసే ఉంటారు. అయితే, నిజ జీవితంలో అలాంటి షాకింగ్ సంఘటన కేరళలోని కోజికోడ్‌లో వెలుగు చూసింది. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 5 ఏళ్ల పాటు ఓ మహిళ పొట్టలోనే కత్తెర ఉండిపోయిన ఈ సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఐదేళ్ల తర్వాత ఆపరేషన్ చేసి మహిళ పొట్టలోంచి 11 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను తొలగించారు వైద్యులు. ఐదేళ్ల క్రితం హర్షీనా అశ్రఫ్ అనే మహిళకు ఆపరేషన్ చేసిన క్రమంలో పొట్టలోనే కత్తెరను వదిలేశారు వైద్యులు. ఏం జరిగిందింటే? 2017లో మూడో కాన్పు కోసం కోజికోడ్‌లోని వైద్య కళాశాలకు వెళ్లింది బాధితురాలు హర్షీనా అశ్రఫ్. ఆపరేషన్ చేసిన తర్వాత పొట్టలో విపరీతమైన నొప్పి ఏర్పడిందని.. నొప్పి తీవ్రమవటం వల్ల మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. స్కానింగ్ తీయగా పొట్టలో కత్తెర ఉన్నట్లు తెలిసింది. ‘2017, సెప్టెంబర్ 30 ఆపరేషన్ కోసం వెళ్లాను. ఆ తర్వాత నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. పలువురు వైద్యులను కలిసినా నా నొప్పికి పరిష్కారం లభించలేదు. ఆ తర్వాత సిటీ స్కాన్ చేయగా అసలు విషయం తెలిసింది. పొట్టలో ఇనుప వస్తువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత కత్తెరగా చెప్పారు.’ అని బాధితురాలు తెలిపారు. కత్తెర ఉన్నట్లు తెలిసిన తర్వాత మళ్లీ తనకు ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అదే ఆసుపత్రికి వెళ్లారు బాధితురాలు. వైద్యులకు విషయం తెలపగా.. ఆపరేషన్ చేసి కత్తెరను తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తాను అనుభవించిన నరకంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్‌లకు ఫిర్యాదు చేశారు బాధితురాలు హర్షీనా అశ్రఫ్. దీంతో ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు ఆరోగ్య మంత్రి. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన -
మేం వెరీ లక్కీ: ముఖ్యమంత్రి
తిరువనంతపురం: హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. కేరళ మూలాలున్న ఆమె సేవలను రాష్ట్రం కోసం అందిపుచ్చుకోవడం తమకు ఆనందంగా ఉందని, ఈ విషయంలో కేరళ ప్రజలు చాలా అదృష్టవంతులని సీఎం విజయన్ ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, ప్రముఖ ప్రపంచ ఆర్ధికవేత్తగా పేరొందిన గీతా గోపీనాథ్‌ను కేరళ ఆర్థిక సలహాదారుగా నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార సీపీఎం సైద్ధాంతిక భావజాలానికి విరుద్ధంగా ఈ నియామకం ఉందని విమర్శకులు అంటున్నారు. 38 ఏళ్ల గీత నూతన ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రబోధిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉదారవాద ఆర్థిక విధానాలకు కాలం చెల్లిందని, ఈ నేపథ్యంలో ఆమె తన వైఖరిలో ఏమేరకు మార్పు తెచ్చుకున్నారో తెలియదని సొంత పార్టీ సీపీఎం నేతలు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.