న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్ 2023తో ప్రారంభమయిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో 6.3% స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తాజా ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ అంచనా వేసింది. తొలి జూలై నెల అంచనా 6.1 శాతాన్ని ఈ మేరకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) అంచనాలకు మించి వినియోగ గణాంకాలు నమోదవడం తాజా అప్‌గ్రేడ్‌కు కారణమని అవుట్‌లుక్ వివరించింది. 2024–25లో కూడా భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ 6.3%గా పేర్కొంది.
వృద్ధి స్పీడ్‌లో టాప్..
ప్రపంచంలోని రెండవ ఆర్థిక వ్యవస్థ చైనాకన్నా భారత్ వృద్ధి స్పీడ్ వేగంగా ఉండడం మరో అంశం. 2023లో చైనా వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్ 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు 5%కి తగ్గింది. 2024లో అంచనాలను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా ఈ రేటు 4.2%కి దిగింది. చైనాలో ప్రోపర్టీ మార్కెట్ సంక్షోభంలో ఉండటం కూడా వృద్ధి రేటు కోతకు కారణమని ఐఎంఎఫ్ పేర్కొంది.
ప్రపంచ వృద్ధి అంచనా డౌన్
కాగా, 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను మాత్రం ఐఎంఎఫ్ తగ్గించడం గమనార్హం. ఇంతక్రితం 3.2 శాతంగా ఉన్న గ్లోబల్ వృద్ధి అంచనాలను తాజాగా 3%కి కుదించింది.
కొన్ని సంస్థల అంచనా ఇలా..
సంస్థ 2023–24 (వృద్ధి శాతాల్లో)
ఆర్‌బీఐ 6.5
ప్రపంచబ్యాంక్ 6.3
ఎస్‌అండ్‌పీ 6.0
ఫిచ్ 6.3
మూడీస్ 6.1
ఏడీబీ 6.3
ఇండియా రేటింగ్స్ 6.2
ఓఈసీడీ 6.3
Comments
Please login to add a commentAdd a comment