ద్రవ్యలోటు కట్టడి.. జీఎస్టీ అమలు కీలకం!
భారత్‌కు ఐఎంఎఫ్ సూచన....
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం- ద్రవ్యలోటు కట్టడి, ధరల పెరుగుదల అదుపు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు, సబ్సిడీలు దుర్వినియోగం జరక్కుండా లక్ష్యాన్ని చేరేలా తగిన చర్యలు భారత్ ఆర్థికాభివృద్ధిలో కీలకమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా నివేదిక ఒకటి పేర్కొంది. ఆయా అంశాల్లో తగిన చర్యలు అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకుల నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించడమే కాకుండా, పెట్టుబడుల అవకాశాలనూ పెంపొందిస్తాయని వివరించింది. ముఖ్యాంశాలు చూస్తే...
⇔ 2016, 2017లో దేశ వృద్ధి రేటు అంచనాను 7.4 శాతంగా అంచనా.
⇔ అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ్డానికి 2017-18లో దేశ ద్రవ్యలోటు 3 శాతంగా ఉండాలి.
⇔ ఆర్‌బీఐ రేటు నిర్ణయ ప్రక్రియ విధానం మరింత పటిష్టం కావాలి. అలాగే రేటు కోత నిర్ణయాల ప్రయోజనం బ్యాంకింగ్ ద్వారా సకాలంలో కస్టమర్‌కు అందే చర్యలు ఉండాలి.
⇔ ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం వల్ల పసిడి దిగుమతులు అదుపులో ఉంటాయి. కరెంట్ అకౌంట్ లోటుకు సంబంధించి ఇది సానుకూల అంశం.