2015లో వృద్ధి 7.5 శాతం: మూడీస్ | Indian economy to grow at 7.5% in 2015: Moody's | Sakshi
Sakshi News home page

2015లో వృద్ధి 7.5 శాతం: మూడీస్

Published Sat, Apr 18 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

Indian economy to grow at 7.5% in 2015: Moody's

న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2015లో 7.5 శాతం ఉంటుందని రేటింగ్ సంస్థ మూడీస్ అంచనావేసింది. 2014లో ఈ రేటు 7.2 శాతం. వడ్డీరేట్ల తగ్గింపు వల్ల వ్యవస్థలో ప్రైవేటు రంగం పెట్టుబడి పెరుగుతుందని విశ్లేషించింది. జనవరి-మార్చి మధ్య జీడీపీ వృద్ధి 7.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మున్ముందు క్వార్టర్లలో ఈ రేటు మరింత పురోగమించడానికే తగిన అవకాశాలు ఉన్నాయని తన తాజా నివేదికలో తెలిపింది.

2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు చైనాకన్నా అధికంగా 7.5 శాతంగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకులు అంచనా వేయడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement