ప్రపంచ ఎకానమీపై ఐఎంఎఫ్‌ కీలక ప్రకటన | IMF Upgrade The Global Economy | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఎకానమీపై ఐఎంఎఫ్‌ కీలక ప్రకటన

Published Wed, Jan 31 2024 11:24 AM | Last Updated on Wed, Jan 31 2024 12:19 PM

IMF Upgrade The Global Economy - Sakshi

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2024 అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)  అప్‌గ్రేడ్‌ చేసింది. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అమెరికా వృద్ధి పయనం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంది.

తాజా అవుట్‌లుక్‌లో 2024 వృద్ధి రేటును ఇంతక్రితం 2.9 శాతం అంచనాల నుంచి 3.1 శాతానికి పెంచింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ద్రవ్యోల్బణం అవుట్‌లుక్‌ను తగ్గించింది. 2023లో 6.8 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, 2024లో ఇది 5.8 శాతానికి, 2025లో 4.4 శాతానికి తగ్గుతుందని అంచనావేసింది.

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25 కథనాల కోసం క్లిక్‌ చేయండి

అగ్రదేశాల్లో ద్రవ్యోల్బణం 2024లో 2.6 శాతం ఉంటే 2024లో 2 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఇక ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2024లో 3.3 శాతంగా ఉంటే, 2025లో 3.6 శాతానికి పెరుగుతుందని తెలిపింది. చరిత్రాత్మాక వాణిజ్య వృద్ధి సగటు 4.9 శాతంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement