భారత్ ఓ ఆశా కిరణం | CPEC projects, high growth crucial for prosperity: IMF | Sakshi
Sakshi News home page

భారత్ ఓ ఆశా కిరణం

Published Sat, Oct 15 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

భారత్ ఓ ఆశా కిరణం

భారత్ ఓ ఆశా కిరణం

బ్యాంక్‌ల మొండి బకాయిలు సమస్యే
ఐఎంఎఫ్ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో భారత్ ఆశాకిరణమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభివర్ణించింది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండి బకాయిలు సమస్యేనని పేర్కొంది.  భారత్‌తోపాటు చైనా సైతం తన వృద్ధిని కొనసాగిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ మౌరిస్ ఆబ్స్‌ఫెల్డ్ అన్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు.

శుక్రవారం ఢిల్లీలో బ్రూకింగ్స్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఆబ్స్‌ఫెల్డ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత్‌లో ఇప్పటికీ నిర్మాణపరమైన సవాళ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విషయంలో చెప్పుకోతగ్గ పురోగతి ఉన్నప్పటికీ, అవి పెరిగిపోవడం సవాలేనన్నారు. 2016, 2017 సంవత్సరాల్లో భారత్ 7.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఇటీవలే ఐఎంఎఫ్ తన అంచనాలను ప్రకటించి
న విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement