
వృద్ధి రేటు అంచనాలకు ఐఎంఎఫ్ కోత
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా 2016, 2017 వృద్ధి రేటు అంచనాకు 10 బేసిస్ పాయింట్లు (0.1 శాతం) కత్తెర వేసింది.
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా 2016, 2017 వృద్ధి రేటు అంచనాకు 10 బేసిస్ పాయింట్లు (0.1 శాతం) కత్తెర వేసింది. వచ్చే రెండేళ్లలో భారత్ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా రెండేళ్లలో ఈ రేటు వరుసగా 3.1 శాతం, 3.4 శాతంగా ఉంటుందనీ విశ్లేషించింది. వృద్ధి అంచనా కోతకు ప్రధానంగా యూరప్ నుంచి బ్రిటన్ విడిపోవడం (బ్రెగ్జిట్) కారణమని పేర్కొంది.