ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ప్రశంసలు కురిపించింది . ఆహార భద్రత పథకం దేశంలో తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించిందని కితాబిచ్చింది. 2019లో భారత్‌లో తీవ్ర పేదరికం ఒక శాతం కంటే దిగువన ఉందని.. కరోనా సమయంలోనూ అది స్థిరంగానే కొనసాగిందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది.
పేదరిక స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కీలకంగా మారిందని ఐఎంఎఫ్ తెలిపింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో దేశంలో పేదరికం అత్యంత వేగంగా క్షీణించిందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది.
కరోనా రాకతో ప్రజలంతా తమ ఇంటి వద్ద పరిమితమైన విషయం తెలిసిందే. వలస కూలీలు, పేదలకు ఆహార భద్రతను అందించేందుకుగాను...కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని తీసుకువచ్చింది. కాగా ఈ ఉచిత రేషన్ పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు పొడిగిస్తూ కేంద్రం ఇటీవలే నిర్ణయం తీసుకుంది.
చదవండి: ఇంధన ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..!
Comments
Please login to add a commentAdd a comment