సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులుగా ఐక్యరాజ్యసమితి (యూఎన్) సదస్సుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంగళవారం వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి వి.సుబ్రమణ్యన్ విద్యార్థుల బృందంతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నంద్యాలకు చెందిన లారీ డ్రైవర్ కుమార్తె చాకలి రాజేశ్వరికి తన చైర్ ఆఫర్ చేసి అందులో కూర్చోబెట్టారు. సుమారు 1.20 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాజేశ్వరి అదే చైర్‌లో కూర్చుంది.
ఈ సందర్భంగా సుబ్రమణ్యన్ విద్యార్థులతో మాట్లాడుతూ.. కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలని, సమాజంలో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంతో పాటు దేశానికి చేతనైన సాయం చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సుబ్ర మణ్యన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘నేను నా కార్యాలయంలో ఏపీ నుంచి వచ్చిన తెలివైన విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
వారంతా అత్యంత నిరాడంబరమైన నేప థ్యాల నుంచి వచ్చినవారు కావడం వల్ల భార తీయుడిగా గర్వపడుతున్నాను. విద్య ప్రాముఖ్యత ప్రతి భారతీయ కుటుంబం మనసులోకి ప్రవేశించింది’ అంటూ సుబ్రమ ణ్యన్ ట్వీట్ చేశారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ ‘వారిని ప్రోత్స హిస్తున్నందుకు ధన్యవాదాలు సుబ్రమణ్యన్గారూ! మిమ్మల్ని కలవడం, మీతో సంభాషించడం మన పిల్లలకు, ఏపీ పిల్లలందరికీ అపురూపమైన గౌరవం. మన పిల్లలు మన రాష్ట్రాన్ని, మన విద్యా విధానం సారాంశాన్ని ప్రపంచం మొత్తం చాటిచెప్పడాన్ని చూసి నేను గర్వపడుతున్నాను’ అంటూ రీట్వీట్ చేశారు.
గీతాగోపీనాథ్‌కు సీఎం జగన్ ధన్యవాదాలు
ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతాగోపీనాథ్‌కు కూడా సీఎం ధన్యవాదాలు తెలి పారు. ఐఎంఎఫ్ కార్యాలయంలో విద్యార్థులు గీతాగోపీనాథ్‌తో సమావేశమైన సందర్భంగా ఆమె ‘ఐఎంఎఫ్‌కి ఏపీ విద్యార్థులను స్వాగతించ డం నిజంగా ఆనందంగా ఉంది. వారి యూఎన్, యూఎస్ పర్యటనలో భాగంగా ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయానికి రావడం సంతోషిస్తున్నాను’ అంటూ ఏపీ సీఎంను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన సీఎం జగన్.. ‘మా పిల్లలను కలిసినందుకు, వారిని ఇంత ఆప్యాయంగా చూస్తు న్నందుకు ధన్యవాదాలు గీతా గోపీనాథ్ గారూ, వారి చిరునవ్వులు అన్నీ చెబుతున్నాయి! విద్య అనేది వ్యక్తిగత జీవితాలను మా ర్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకం అని నేను నిజంగా నమ్ముతున్నాను. మన పిల్లలే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ వేదికపై ఆత్మవిశ్వాసంతో ప్రాతి నిధ్యం వహిస్తున్న మన పిల్లలను చూసినప్పుడు నేను గర్వంతో ఉప్పొంగిపోయాను’ అంటూ రీట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment