అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షాకింగ్ న్యూస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 180మిలియన్ల (18కోట్లు) మహిళా ఉద్యోగాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. బాలీలో జరిగిన ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా ఐఎంఎఫ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆటోమేషన్ లాంటి కొత్త సాంతకేతికల కారణంగా ఈ ఉద్యోగాలు ఊడిపోన్నాయని తెలిపింది
30 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో పురుషులతో పోలిస్తే ఈ నష్టం మహిళల్లో ఎక్కువగా ఉందని తేలిందని తెలిపింది. పురుషులతో (9శాతం)పోలిస్తే మహిళలు (11శాతం) ఆటోమేషన్ ప్రభావానికి గురవుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగుల్లో సంబంధిత నైపుణ్యాలను పెంచాలని గ్లోబల్ లిడర్ షిప్‌ను కోరింది. అలాగే నాయకత్వ స్థానాల్లో ఉన్నలింగ వివక్షను రూపు మాపాలని సూచించింది. మహిళల్లో కొత్త నైపుణ్యాల పెంపొందించడం ద్వారా భారత్ లాంటి దేశాల్లో ఉత్పాదక సామర్ధ్యాలను పెంచుకోవడంతోపాటు లింగ సమానత వస్తుందని తెలిపింది.
డిజిటల్ యుగంలో పురోభివృద్ధికి అవసరమైన కొన్ని నైపుణ్యాలు మహిళలు తక్కువగా ఉన్నారని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాల వృద్ధి అంచనాలున్నప్పటికీ మహిళా ప్రాతినిధ్యం తక్కువ అని తెలిపింది. అలాగే ఆటోమేషన్‌కి తక్కువ అవకాశం ఉన్న ఆరోగ్యం, విద్య, సాంఘిక సేవలు లాంటి సాంప్రదాయ రంగాల్లో మహిళలు ఉద్యోగావకాశాలు వృద్ధి చెందుతున్నాయని పేర్కొంది. గత రెండు దశాబ్దాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచుకోవడంలో పురోగతి జరిగినా, ఇంక అసమానత భారీగానే ఉందని తన పరిశోధనా పత్రంలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment