
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 31 పాయింట్లు పెరిగి 23,693కు చేరింది. సెన్సెక్స్(Sensex) 38 పాయింట్లు ఎగబాకి 78,045 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.25 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.57 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.33 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.16 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.46 శాతం ఎగబాకింది.
ఇదీ చదవండి: ఎన్‌పీఏల వేలానికి ప్రత్యేక పోర్టల్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల భవిష్యత్తులో కీలక వడ్డీరేట్ల కోత ఉంటుందనే సంకేతాలిచ్చిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్ల కోతపై ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) క్రమంగా విక్రయాలు తగ్గిస్తున్నారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుంది. భారత రూపాయి స్థిరత్వం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది. బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లు, ఐటీ షేర్లు ఇటీవలి ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.



(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)