సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌పై మంత్రి వీడియో | Ashwini Vaishnav Make Video On Semiconductor Ecosystem | Sakshi
Sakshi News home page

ఈడీఏ సాధనాలను 104 వర్సిటీలకు పంపిణీ

Published Fri, Mar 1 2024 10:38 AM | Last Updated on Fri, Mar 1 2024 10:57 AM

Ashwini Vaishnav Make Video On Semiconductor Ecosystem - Sakshi

భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను వివరిస్తూ సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నాలుగు నిమిషాల నిడివిగల వీడియో, దేశంలో పటిష్ఠమైన సెమీకండక్టర్‌ ఎకోసిస్టమ్‌ను రూపొందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి చెప్పారు.

ఇటీవల మూడు సెమీకండక్టర్ ప్లాంట్‌ల స్థాపనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఈ వీడియో వైరల్‌ మారుతుండడం విశేషం.  అందులో టాటా గ్రూప్‌ 2 ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా.. జపాన్‌కు చెందిన రెనెసాస్‌ భాగస్వామ్యంతో సీజీ పవర్‌ ఒక ప్లాంటు నిర్మించనుంది. ఇవి రాబోయే 100 రోజుల్లో నిర్మాణాన్ని ప్రారంభించనున్నాయి. వీటి వల్ల మొత్తం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

ఇదీ చదవండి: 3000 ఎకరాల్లో కృత్రిమ అడవిని నిర్మించిన కొత్త పెళ్లికొడుకు

మంత్రి సెమీకండక్టర్‌ ఎకోసిస్టమ్‌ గురించి వివరిస్తున్న వీడియోలో డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఏటీఎంపీ (అసెంబ్లీ-టెస్టింగ్-మార్కింగ్-ప్యాకేజింగ్) సర్క్యూట్ వంటి ముఖ్యమైన విభాగాల గురించి మాట్లాడటం గమనించవచ్చు. సెమీకండక్టర్‌ ఎకోసిమ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌పై ప్రభుత్వం దృష్టిసారించినట్లు చెప్పారు. అందుకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్(ఏడీఏ) టూల్స్ చాలా ఖరీదైనవన్నారు. కేవలం ఒక లైసెన్స్ కోసం రూ.10-15 కోట్ల వరకు ఖర్చవుతుందని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఈ ఈడీఏ సాధనాలను దేశంలోని 104 యూనివర్సిటీలకు పంపిణీ చేసిందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement