
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, టాటా గ్రూప్ మాజీ చైర్‌పర్సన్ 'రతన్ టాటా' (Ratan Tata) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన ఈయన నేటితో 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. రతన్ టాటా జన్మదినం సందర్భంగా ఈ కథనంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
రతన్ టాటా గురించిన 5 ఆసక్తికరమైన విషయాలు
👉రతన్ టాటా క్యాంపియన్ స్కూల్‌లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌కు వెళ్లారు. ఈయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా.
👉రతన్ టాటా "ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా' అనే పుస్తకారు రాశారు.
👉86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. గతంలో ఈయన నాలుగు సార్లు పెళ్లికి దగ్గరగా వచ్చినట్లు సమాచారం, కానీ ప్రతి సారీ ఏదో ఒక భయం, లేదా ఇతర కారణాల వల్ల వెనక్కి తగ్గారు.
👉పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకే లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధర వద్ద లభించే కారు కావడంనా గమనార్హం. చిన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారుని లాంచ్ చేసినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
👉తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. భారతదేశంలోని అనేక మంచి కార్యక్రమాల కోసం రతన్ టాటా లెక్కకు మించిన డబ్బును విరాళంగా ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు.